PM Modi Birthday : మోడీ పాల‌న భేష్.. బర్త్ డే విషెష్ లో కేసీఆర్ ప్ర‌శంస‌

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విష‌యంలో జ‌గ‌న్, కేసీఆర్, చంద్ర‌బాబు ఒకేలా స్పందించారు

  • Written By:
  • Updated On - September 17, 2022 / 01:05 PM IST

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విష‌యంలో జ‌గ‌న్, కేసీఆర్, చంద్ర‌బాబు ఒకేలా స్పందించారు. బ‌ర్త్ డే విషెస్ తెలియ‌చేస్తూ ట్వీట్ట‌ర్ వేదిక‌గా కోట్లాది మంది తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌పున శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌రెన్నో సంవ‌త్స‌రాలు ప‌రిపాల‌న కొన‌సాగించాల‌ని కేసీఆర్ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల మోడీకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఆయ‌న‌తో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేస్తూ ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల స‌హ‌జ స్నేహితునిగా బీజేపీతో మెలుగుతున్నారు. ఆయ‌న కూడా మోడీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విష‌స్ తెలియచేస్తూ మ‌రింత కాలం సుప‌రిపాల‌న అందించాల‌ని ఆకాంక్షించారు. ఇలా కేసీఆర్‌, జ‌గ‌న్, చంద్ర‌బాబు ఇంచుమించు ఒకేలా బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు మోడీకి తెలియ‌చేస్తూ సందేశం పంప‌డం గ‌మ‌నార్హం.

 

మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కే చంద్రశేఖర్ రా వు ఆయనకు శుభాకాంక్షలు తెలిపుతూ అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌పై పోస్టులు పెట్టారు. నరేంద్ర మోదీ సుదీర్ఘకాలం పాటు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కోట్లాదిమంది తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌పున జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తోన్నాననంటూ కేసీఆర్ ఓ ప్రకటనను ట్విట్టర్‌లో విడుదల చేశారు. మరిన్నో సంవత్సరాలు పరిపాలన సాగించాలని చెప్పారు.

 

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మోదీకి షేక్ హ్యాండ్ ఇస్తోన్న ఓ ఫొటోను ఆయన ట్వీట్‌కు జతచేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చంద్రబాబు చెప్పారు. ప్రజల సంక్షేమానికి, దేశ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేయాలని అకాంక్షించారు. మోదీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ప్రధాని జన్మదినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సేవా పఖ్వాడా వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఆరోగ్య, రక్తదాన, టీకా శిబిరాలను ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల్లో బూస్టర్ డోసులు అందిస్తారు. టీకాలను వేస్తారు. హెల్త్ చెకప్‌ చేస్తారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సేవా పఖ్వాడా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా చీపురు పట్టారు. ఢిల్లీలో అత్యంత రద్దీతో కూడుకుని ఉన్న హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌ పరిసరాలను ఆయన చీపురుతో ఊడ్చారు.

జన్మదినాన్ని పురస్కరించుకుని మధ్యప్రదేశ్‌లో మోడీ పర్యటించనున్నారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను అభయారణ్యంలో విడిచిపెట్టనున్నారు. షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్‌కు మోడీ చేరుకుని కరాహల్‌లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌ సమ్మేళనంలో పాల్గొంటారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 72వ పుట్టిన రోజు శ‌నివారం దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు జ‌రుపుకుంటున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌కు వెళ్లిన మోడీ భారత్‌కు తిరిగి వచ్చారు. రెండు రోజుల సదస్సు సందర్భంగా రష్యా, టర్కీ అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, రెసెప్ తయ్యిప్ ఎర్డగాన్ సహా వివిధ దేశాధినేతలు, ప్రధానమంత్రులతో సమావేశం అయిన విష‌యం విదిత‌మే. ద్వైపాక్షిక సంబంధాలపై చ‌ర్చించిన త‌రువాత ఆయ‌న ఇండియాకు చేరుకున్నారు. శ‌నివారం మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని న‌మీబియా చీతాల‌ను అడ‌విలోకి విడిచిపెట్ట‌డం ప్ర‌త్యేక ఈవెంట్‌.