Site icon HashtagU Telugu

Malla Reddy: దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపిన ఘనత కేసీఆర్ దే : మల్లారెడ్డి

Malla Reddy Comments Mahend

Malla Reddy Comments Mahend

Malla Reddy: మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి గడ్డపై గులాబీ జెండా ఎగిరేసేలా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడారు.

‘‘దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపిన ఘనత కేసీఆర్ దే.. అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం అయింది. మల్కాజ్గిరి పార్లమెంటులోని ఏడు శాసనసభ నియోజకవర్గాలలో మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మేయర్లు, నాయకులు పాల్గొని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ ను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలిపి దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత మేయర్, పాలకవర్గానికే దక్కుతుందన్నారు’’ మల్లారెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 100 రోజులైనా ప్రజలకు ఇచ్చిన హామీలలో నెరవేర్చింది శూన్యం.. కూల్చడంలో నెంబర్ వన్ ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం అయినటువంటి మల్కాజ్ గిరి పార్లమెంట్ కు బిఅర్ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాగిడి లక్ష్మారెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితంలో అనేక సేవా కార్యక్రమాలు చేశానని నా సేవా దృక్పథం, నిబద్దతను చూసి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ నాకు ఎంపి ఆభ్యర్ధిగా అవకాశం కల్పించారు అన్నారు. మల్కాజ్ గిరి ఎంపీగా భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తే నియోజకవర్గంతో పాటు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానన్నారు.

Exit mobile version