Site icon HashtagU Telugu

Amit Shah: దేశంలోనే అవినీతిలో నెంబర్ వన్ కేసీఆర్: సీఎంపై అమిత్ షా ఫైర్

September 17

Amit Shah speech in Khammam BJP Public Event

Amit Shah: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దేశంలోనే “అవినీతిలో నంబర్ వన్” అని, బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బిఆర్ఎస్ ప్రభుత్వ “అవినీతి ఒప్పందాలపై” విచారణ జరుపుతుందని అమిత్ షా అన్నారు. బీఆర్ఎస్ అవినీతి వ్యవహారాలన్నింటిపై విచారణ జరిపి, అవినీతికి పాల్పడిన వారిని కటకటాల వెనక్కి నెట్టుతుందని అన్నారు. అభ్యర్థులు ఆరుట్ల దశమంత్ రెడ్డి, ధర్మపురి అరవింద్‌లకు మద్దతుగా జనగాం, కోరుట్ల సెగ్మెంట్లలో బీజేపీ ప్రచార సభల్లో షా  పాల్గొని మాట్లాడారు. బైరన్‌పల్లి అమరవీరుల స్మారక చిహ్నం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

సీఎం కేసీఆర్ అమరవీరులకు నివాళులు అర్పించడం లేదని, అసదుద్దీన్ ఒవైసీకి భయపడి సెప్టెంబర్ 17వ తేదీని నిర్లక్ష్యం చేస్తున్నారని, బీఆర్‌ఎస్ స్టీరింగ్ ఒవైసీ చేతుల్లోనే ఉందని అమిత్ షా అన్నారు. ‘మేం అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ని అధికారికంగా విమోచన దినోత్సవంగా జరుపుకుంటాం.. జనగాంలో పాలిటెక్నిక్‌ స్థాపిస్తామన్న హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదని.. ప్రస్తుత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, జనగామలో కొత్త అభ్యర్థి భూ ఆక్రమణలు, అవినీతిలో కూరుకుపోయారని అమిత్ షా అన్నారు.

తెలంగాణ ప్రజలు డిసెంబర్ 3న రెండోసారి దీపావళి జరుపుకోవచ్చు, ఆపై జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించినప్పుడు మూడోసారి జరుపుకోవచ్చునని షా అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు ఎంపీ ధర్మపురి అరవింద్‌కు ఘనత ఇస్తూ, “అరవింద్‌ ఎప్పటినుండో బోర్డును కోరుతూ, త్వరలో ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. ఇప్పుడు పసుపు రైతులకు పంటకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామని షా అన్నారు.

Also Read: CM KCR: ఎన్టీఆర్ 2 రూపాయల పథకం వల్లే పేదల ఆకలి తీరింది: కేసీఆర్