Site icon HashtagU Telugu

Kavitha : కేసీఆర్ నా లీడర్ .. కాకపోతే అంటూ కవిత సంచలనం

Kcr Kavitha

Kcr Kavitha

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) తాజా వ్యాఖ్యలు పార్టీ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. “కేసీఆర్‌ మాత్రమే నా నాయకుడు, ఆయన ప్లేస్ లో మరొకర్ని ఉహించుకోలేను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. 25 ఏళ్లుగా తన తండ్రికి లేఖలు రాస్తున్నానని, అయితే ఈసారి తన లేఖ బయటకు ఎలా లీక్ అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. తన లేఖను లీక్ చేసిన వారిని బయటపెట్టాలని ఆమె పార్టీ(BRS)ని డిమాండ్ చేసింది.

Congress : కాంగ్రెస్ నేతలపై శశి థరూర్ ఆగ్రహం..వారికి వేరే పనులు లేవంటూ చురకలు

తనపై వస్తున్న తప్పుడు వార్తలపై పార్టీ ఎందుకు ఖండించడం లేదని ఆమె ప్రశ్నించారు. పార్టీ చేయాల్సిన పనులను తాను ‘జాగృతి’ ద్వారా చేస్తున్నానని ఆమె గుర్తుచేశారు. కేసీఆర్‌కు నోటీసులు వచ్చినప్పుడు ఎవరూ స్పందించకపోగా, మరొక నేతకు నోటీసులు రాగానే పెద్ద ఎత్తున హడావిడి చేయడంపై ఆమె ఆక్షేపం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌లో కోవర్టులు ఉన్నట్లు అంగీకరిస్తే, వాళ్లను ఎందుకు బయటకు పంపడం లేదని ఆమె నిలదీశారు. దూతలు పంపి పచ్చబొట్టు పెట్టే ప్రయత్నాలు ఎంత వరకు సరైందని ప్రశ్నించారు.

నిజామాబాద్ ఎంపీగా తాను ఓడిపోవడం వెనుక పార్టీ నేతలే ఉన్నారని, తనను కావాలనే ఓడించారని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీకి దూరం చేసే కుట్ర జరుగుతోందని, అమెరికా నుంచి వచ్చినలోగా తనను పార్టీ నుంచి పంపించే ప్రయత్నం జరిగిందని ఆమె ఆరోపించారు. తాను చిచోరా రాజకీయాలు చేయనని, వెన్నుపోటు రాజకీయాలు తెలియవని స్పష్టంగా చెప్పిన ఆమె “ఎవరైనా నా జోలికి వస్తే ఊరుకోను” అంటూ బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఆమె వ్యాఖ్యలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారు? కేటీఆర్ ఏమంటారు? అనే అంశాలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ కలిగిస్తున్నాయి.