Site icon HashtagU Telugu

KCR Contest: కామారెడ్డి, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల్లో కేసీఆర్ పోటీ

KCR

The Child Of India.. Will Always Come To Maharashtra.. Kcr

CM KCR: సీఎం కేసీఆర్ ఇవాళ హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్ వేదికగా బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను పలువురు (కాంగ్రెస్, బీజేపీ) ముఖ్యనేతలు ఓడిస్తామని  ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే సీఎం కేసీఆర్ తాను ఎక్కడ్నుంచో పోటీ చేస్తారో క్లారిటీ ఇచ్చేశారు.

బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ప్రకారం..  వచ్చే ఎన్నికల్లో రెండు స్తానాల్లో పోటీ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌ లో పోటీ చేయనున్నట్టు చెప్పారు. అంతేకాదు.. ఆయన గజ్వేల్  అసెంబ్లీ సెగ్మెంట్‌ లో కూడా పోటీ చేస్తారు. అయితే కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రైతుల నుండి నిరసనల కారణంగా అక్కడ బిఆర్‌ఎస్‌కు పరిస్థితి అంత అనుకూలంగా లేదని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. దీంతో గజ్వేల్ నుంచి కూడా పోటీచేయనున్నారు.

ఏడుగురు సిట్టింగులకు టికెట్ల నిరాకరణ…

సుభాష్ రెడ్డి – ఉప్పల్

రాజయ్య – స్టేషన్ ఘనపూర్

రాములు నాయక్ – వైరా

రేఖా నాయక్ -ఖానాపూర్

చెన్నమనేని రమేష్ – వేములవాడ

గంప గోవర్ధన్ -కామారెడ్డి

రాథోడ్ బాపురావు -బోధ్

విద్యాసాగర్ రావు – కోరుట్ల ( అభ్యర్థిగా కుమారుడు)