KCR TV9 Debate : టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనంపై కేసీఆర్ స్పష్టత..

ఈ డిబేట్ లో చాల విషయాలను గురించి కేసీఆర్ ను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ఫై చేస్తున్న ఆరోపణల ఫై ఆయన స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలు..? తెలంగాణ రాష్ట్రం ఎందుకు అప్పుల పాలైంది..? 24 గంటలు కరెంట్ బిఆర్ఎస్ ఇవ్వలేదా..? తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ మాట ఎందుకు తప్పాడు..?

  • Written By:
  • Publish Date - April 23, 2024 / 08:36 PM IST

బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR) దాదాపు 12 ఏళ్ల తర్వాత టీవీ డిబేట్ (TV Debate) లో పాల్గొన్నారు. ప్రస్తుతం కేసీఆర్ కు ఏమాత్రం కలిసిరావడం లేదనేది వాస్తవం..ఏది మొదలుపెట్టిన రివర్స్ అవుతూ వస్తుంది. ఓ పక్క కూతురు కవిత..ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉంది. నెల రోజులుగా బెయిల్ కోసం ట్రై చేస్తున్నప్పటికీ కోర్ట్ బెయిల్ ఇవ్వడం లేదు. ఇటు బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా ఏమాత్రం బాగాలేదు. వరుస పెట్టి నేతలు పార్టీని వీడుతున్నారు. ఎప్పుడు ఎవరు బై బై చెపుతారో అనేది అందరిలో టెన్షన్ గా ఉంది. ఎన్నికల్లో ఓడిన నేతలే కాదు గెలిచినా నేతలు సైతం పార్టీని వీడుతూ వస్తున్నారు. ఈ తరుణంలో లోక్ సభ ఎన్నికలను కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ క్రమంలో రేపటి నుండి (ఏప్రిల్ 24 ) బస్సు యాత్ర చేపట్టనున్నారు.

ఈ తరుణంలో కేసీఆర్ దాదాపు 12 ఏళ్ల తర్వాత టీవీ చర్చ లో పాల్గొన్నారు. ప్రముఖ న్యూస్ ఛానెల్ టీవీ 9 డిబేట్ లో పాల్గొన్నారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ (TV9 Rajinikanth) కేసీఆర్ తో ఇంటర్వ్యూ చేసారు. ఈ డిబేట్ లో చాల విషయాలను గురించి కేసీఆర్ ను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ఫై చేస్తున్న ఆరోపణల ఫై ఆయన స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలు..? తెలంగాణ రాష్ట్రం ఎందుకు అప్పుల పాలైంది..? 24 గంటలు కరెంట్ బిఆర్ఎస్ ఇవ్వలేదా..? తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ మాట ఎందుకు తప్పాడు..? వీటితో పాటు అనేక ఆరోపణల ఫై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.

బిఆర్ఎస్ ను..కేసీఆర్ ను ప్రజలు ఎప్పటికి మరచిపోరు..పదేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసాం..రైతుల కోసం ఏ రాష్ట్రం ఆలోచించని విధంగా మీము అలోచించి రైతు బంధు , రైతు భీమా వంటి పథకాలతో పాటు వడ్ల కొనుగోలు , రైతులకు గిట్టుబాటు ధర మొదలగున్నవి ఎన్నో చేసాం. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు తెలంగాణ ఎలా ఉంది..బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది..ఐటీ ని ఎంతగా డెవలప్ చేసాం..ప్రతి జిల్లాను ఎంతగా అభివృద్ధి చేసాం..అనేది ప్రజలెవ్వరూ మరచిపోరు. కాకపోతే కాంగ్రెస్ ప్రకటించిన హామీలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు అటు మొగ్గు చూపారు కానీ బిఆర్ఎస్ ఫై వ్యతిరేకత తో కాదని క్లారిటీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ముందుగా టిఆర్ఎస్ (BRS) పార్టీని అప్పట్లో కాంగ్రెస్లో విలీనం చేస్తామన్నది వాస్తవమేనని, అయితే ఆ మాటను కాంగ్రెస్ వినలేదని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు కలిపి ఎన్నికలు పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. అది కరెక్ట్ కాదని, వద్దని నేను చెప్పినా వాళ్లు వినలేదు. దీంతో విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా. ఆ తర్వాత మేం ఇండిపెండెంట్గా నిల్చొని గెలిచాం’ అని తెలిపారు.

ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తనను తగ్గించే ప్రయత్నాలు చాలా మంది చేసి భంగపడ్డారన్నారు. కాంగ్రెస్, బీజేపీవి వికృత రాజకీయ క్రీడలని .. సోషల్ మీడియాలో కొందరు తనపై విషం చిమ్మారని దుయ్య బట్టారు. దీనిని సమాజం అంతా చూస్తోందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ చేస్తున్న దాడిని తట్టుకోగలరా? అనే ప్రశ్నపై కేసీఆర్ స్పందించారు. ఆ విషయాన్ని తాను అసలు లెక్కలోకి తీసుకోవడం లేదని అన్నారు. ఒకప్పుడు ప్రధాన మంత్రి హోదాలో ఉన్న ఇందిరా గాంధీ కూడా ప్రత్యర్థులను ఏం చేయలేకపోయారని గుర్తు చేశారు. కేసీఆర్ అనే వ్యక్తి శూన్యం నుంచి సునామీ సృష్టించారని, స్వయంగా ఓ పార్టీ స్థాపించి అనుకున్న లక్ష్యాన్ని సాధించానన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో లేనప్పుడు నామరూపాలు లేకుండా పోయిందా? అని ప్రశ్నించారు. అదో వికృతమైన ఆలోచన అని దుయ్యబట్టారు. ఎవరికైనా టైమ్ వస్తుందన్నారు. ప్రజల ఆలోచన సరళిని మార్చినప్పుడు ఫలితం ఇలా ఉంటుందని తెలిపారు. కృత్రిమంగా, వికృతంగా చేసే ఆరోపణలు చరిత్రలో ఎప్పుడూ సక్సెస్ కావన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తనను తిట్టడానికేనా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజలు బాధ్యత ఇచ్చినప్పుడు వారి గురించి ఆలోచించకుండా శ్వేతపత్రాల పేరుతో కాంగ్రెస్ 5 నెలలు సమయం వృథా చేసిందని ఆరోపించారు. ప్రజలను గాలికొదిలి, హామీలను పట్టించుకోకుండా ఊదరగొడుతున్న కాంగ్రెస్పై ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు.

Read Also : Midgut Volvulus : మెలితిరిగిన పేగులకు శస్త్ర చికిత్స.. పూణే వైద్యుల ప్రతిభ..!