Site icon HashtagU Telugu

CM KCR: కేసీర్ఆర్ బీజేపీ బీ టీమ్‌?

cm kcr

New Web Story Copy 2023 06 27t152217.361

CM KCR: బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీజేపీ బీ టీమ్‌ (B Team)లా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు శివసేన సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్. మహారాష్ట్రలో కెసిఆర్ పప్పులు ఉడకవని, తన ప్రభావం మహారాష్ట్రలో ఏ మాత్రం ఉండబోదని అన్నారు సంజయ్ రౌత్. కెసిఆర్ ఇలానే ప్రవర్తిస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో ఓడిపోవడం ఖాయమన్నారు రౌత్. కెసిఆర్ జిమ్మిక్కులు మహారాష్ట్రలో వర్కౌట్ అవ్వవు అన్న ఆయన తెలంగాణాలో ఓడిపోతానేమో అనే భయంతోనే మహారాష్ట్రలో పర్యటిస్తున్నారన్నారు.

తెలంగాణాలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య మాత్రమే రాజకీయ పోరు కొనసాగుతుందని తెలిపారు రౌత్. మహారాష్ట్రలో మహా వికాస్ పార్టీ బలంగా ఉందని, ఇక్కడ కెసిఆర్ చేసేదేం లేదని అభిప్రాయపడ్డారు. ఇక బీజేపీ అసదుద్దీన్ ఒవైసీ తోనూ రాజకీయాలు చేస్తుందని విమర్శించాడు. మొదట అసదుద్దీన్ ఒవైసీని మహారాష్ట్రకు పంపిన బీజేపీ ఇప్పుడు కేసీఆర్‌ (KCR) ను పంపిందని రౌత్ ఆరోపించారు. అయితే కేసీఆర్‌కు ఉద్యమ నాయకుడిగా మంచి ఇమేజ్ ఉందని, కానీ బీజేపీకి ఎందుకు లొంగిపోతున్నారని ప్రశ్నించాడు సంజయ్ రౌత్.

కెసిఆర్ రెండు రోజుల పర్యటనకు గానూ నిన్న సోమవారం ఆయన మహారాష్ట్రకు బయలుదేరిన విషయం తెలిసిందే. రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు ఆయన 600 కార్లతో భారీ కాన్వాయ్ తో బయలుదేరారు.ఇదిలా ఉండగా సీఎం కెసిఆర్ ఇప్పటికే మహారాష్ట్రలో పర్యటించారు. నాందేడ్, ఔరంగాబాద్, నాగ్‌పూర్‌లలో ఆయన పర్యటించారు. మహారాష్ట్రలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, ప్రస్తుతం ఉన్న ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన లను సవాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ ప్రస్తుతం మహారాష్ట్రని టార్గెట్ చేశారు.

Read More: Drug Case: డ్రగ్స్ తో సంబంధం లేకపోయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు: అశురెడ్డి