KCR Vs Congress : ట్వీట్ వార్.. కేసీఆరే ‘పెద్ద పాము’ అంటూ కాంగ్రెస్ కౌంటర్

మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది.  ఆయన హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేసింది.

Published By: HashtagU Telugu Desk
Kcr Vs Congress

KCR Vs Congress : మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది.  ఆయన హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేసింది. ‘‘ఇందుగలదందు లేదని సందేహం వలదు.. ఎందెందు వెతికినా అందందే గలదు అయ్యగారి అవినీతి..!! ఇగ ఈయన మాట్లాడతాడు పాముల గురించి..! తేళ్ళ గురించి…!! నిన్ను మించిన పెద్దపాము తెలంగాణలో లేదు కేసీఆర్..! అందుకే నీ కోరలు పీకి మూలకి కూసోబెట్టిండ్రు తెలంగాణ పబ్లిక్..!!’’ అని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ(KCR Vs Congress) ఇవాళ ఓ ట్వీట్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join

వాస్తవానికి ఈ కామెంట్స్‌ను కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం టైంలో చేశారు.  ఆనాటి కామెంట్స్‌తో కూడిన వీడియోను తాజాగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా టీమ్ ట్విట్టర్‌ వేదికగా పోస్ట్  చేసింది. ‘కేసీఆర్ ముందే చెప్పిండు’ అని తమ ట్వీట్‌కు బీఆర్ఎస్ పార్టీ క్యాప్షన్ పెట్టింది. ‘పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాంరాం.. కరెంటు కాటగలుస్తది.. కైలాసం వైకుంఠపాళి ఆటలో మళ్లీ పెద్ద పాము మింగినట్లైతది. మళ్లా మొదటికొత్తది కథ’ అంటూ అప్పట్లో కేసీఆర్ కామెంట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ ఆనాటి కేసీఆర్ వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేయగా గంటలోనే 20 వేల వ్యూస్ వచ్చాయి. దీనిపై వెంటనే స్పందించిన కాంగ్రెస్ పార్టీ పెద్దపాము కేసీఆరే అంటూ కౌంటర్ ట్వీట్ చేసింది.

Also Read :HDFC Bank : బీ అలర్ట్.. ఆ 13 గంటలు బ్యాంకు సేవలు బంద్

  Last Updated: 03 Jul 2024, 03:58 PM IST