KCR Election Campaign : సెంటిమెంట్ గడ్డపై కేసీఆర్ మొదటి సభ..

ఈ నెల 15 న పార్టీ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో బీఫామ్ లను అందజేసి, ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై దిశానిర్ధేశం చేయనున్నారు. అనంతరం హుస్నాబాద్ సభలో సీఎం పాల్గొనబోతారని

Published By: HashtagU Telugu Desk
KCR Update

KCR Update

తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటన రావడంతో గులాబీ బాస్..ఇక దూకుడు పెంచేందుకు సిద్ధం అవుతున్నారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన..ప్రస్తుతం క్రమంగా కోలుకోవడం తో ఇక ఎన్నికల ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఈరోజు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగించారు ఎన్నికల కమిషన్. తెలంగాణతో పాటు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మిజోరాం రాష్ట్ష్ట్రాల‌కు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ..తెలంగాణ ఎన్నికలకు (Assembly Elections) నవంబర్‌ 3న నోటిఫికేషన్‌ (Notification) విడుదల కానుంది. అదే రోజు నామినేషన్ల ప్రారంభమవుతాయి.

నామపత్రాల దాఖలుకు నవంబర్‌ 10 చివరి తేదీకాగా, నామినేషన్ల ఉపసంహరణకు 15వ తేదీ ఆఖరు తేదీ. అదే నెల 13న నామినేషన్లను పరిశీంచనున్నారు. ఇక నవంబర్‌ 30న పోలింగ్‌ జరుగనుంది. డిసెంబర్‌ 3న ఓట్లను లెక్కిస్తారు. అదేరోజున ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపారు. అలాగే ఈరోజు నుండి ఈ ఐదు రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ మొదలైనట్లు తెలిపారు.

ఇక ఎన్నికల పోలింగ్ కు పట్టుమని రెండు నెలలు కూడా లేకపోవడం తో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటీకే అధికార పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. ఈ నెల 15 న పార్టీ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో బీఫామ్ లను అందజేసి, ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై దిశానిర్ధేశం చేయనున్నారు. అనంతరం హుస్నాబాద్ సభలో సీఎం పాల్గొనబోతారని, సభలో పార్టీ మేనిఫెస్టోను సైతం కేసీఆర్ విడుదల చేయబోతున్నట్లు వినికిడి.

We’re now on WhatsApp. Click to Join.

ఇక హుస్నాబాద్ (Husnabad Public Meeting) లో తొలి ఎన్నికల సభ అనేది నిర్వహించడం సీఎం కేసీఆర్ (CM KCR) సెంటిమెంట్ గా భావిస్తారు. గత ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే కేసీఆర్ ఎన్నికల సమరశంఖం పూరించి ఘన విజయం సాధించారు. అందుకే ఈసారి కూడా అక్కడి నుండే ఎన్నికల సమారా శంఖం పూరించాలని భావిస్తున్నారు. ఈ నెల 16న జనగామ, భువనగిరి కేంద్రాల్లో, 17న సిద్దిపేట, సిరిసిల్లలలో జరిగే సభలకు హాజరవుతారు. 18న మధ్యాహ్నం రెండు గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే సమావేశంలో, సాయంత్రం నాలుగు గంటలకు మేడ్చల్‌లో జరిగే సభకు హాజరుకానున్నారు.

నవంబర్‌ 9న కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో నామినేషన్ వేయనున్నారు వినికిడి. నవంబర్ 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్‌లో కేసీఆర్ మొదటి నామినేషన్ వేసి, ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ దాఖ‌లు చేస్తారు. అనంతరం మ‌ధ్యాహ్నం మూడు గంటల‌కు కామారెడ్డి బహిరంగసభలో పాల్గొననున్నారు.

Read Also : Nobel Economics 2023: హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్‌కు నోబెల్

  Last Updated: 09 Oct 2023, 06:56 PM IST