Site icon HashtagU Telugu

KCR Hot Comments: నేను కొడితే మాములుగా ఉండదు.. కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

KCR

KCR

KCR Hot Comments: మాజీ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు (KCR Hot Comments) చేశారు. ఇన్ని రోజులుగా నేను మౌనంగా ఉన్నా.. నేను కొడితే మాములుగా ఉండదు గ‌ట్టిగానే కొడ‌తా అన‌ని మాజీ సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మాట్లాడిన ఆయ‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై త‌న‌దైన శైలిలో పంచ్‌లు వేశారు. తెలంగాణలో ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదని, అన్ని పథకాలు గంగలో కలిశాయ‌ని మండిప‌డ్డారు. క‌రోనా వచ్చిన కూడా త‌మ ప్ర‌భుత్వం రైతు బంధు ఆపలేదని గుర్తుచేశారు. రైతు భీమా వల్ల ఎంతోమంది రైతులకు సహాయం జరిగిందని గుర్తు చేశారు.

కైలాసం ఆడంగా పెద్ద పాము మింగినట్లు అయ్యింది తెలంగాణ ప్రజల పని అయింద‌న్నారు. మళ్ళీ కరెంట్ కోతలు.. మంచి నీళ్ల కరువు వచ్చాయన్నారు. ఇది ఏంది అని అడిగితే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆలోచన లేకుండా ఎవరో ఏదో చెబితే నమ్మి ఓట్లు వేస్తే ఏమైతదో మంచి గుణపాఠం అయ్యింది తెలంగాణ ప్రజలకు అని కేసీఆర్ అన్నారు. గురుకులాల్లో అన్ని సమస్యలే.. ఎన్నో ఇబ్బందులు పడుతూ అందులొంచ్చి విద్యార్థులు వెళ్లిపోతున్నారని, వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also Read: India Reaches Final: అండ‌ర్‌- 19 ప్ర‌పంచ‌క‌ప్‌.. ఫైన‌ల్‌కు చేరిన టీమిండియా

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం టెండర్లు ఎందుకు పిలవరని ప్ర‌శ్నించారు. వాటిని అడ్డుకోవడంలో మతలాబు ఏంటి? అని విమ‌ర్శించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం గురించి హరీష్ రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న రైతులతో నిరసన కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ముస్లింలను వాడుకుంది కానీ వారికి ఏమి చేయలేదని అన్నారు. ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారంలో అన్ని విష‌యాల‌పై మాట్లాడేందుకు ఒక బ‌హింర‌గ స‌భ పెడ‌తామ‌ని కేసీఆర్ చెప్పారు. ఇక‌పోతే చాలా రోజుల త‌ర్వాత కేసీఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌టంతో బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు సైతం యాక్టివ్ మోడ్‌లోకి వ‌చ్చారు.

ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారంలో పెట్టే బ‌హిరంగ స‌భ‌లో బీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విపై క్లారిటీ వ‌చ్చే సూచ‌న‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌ళ్లీ కేసీఆరే అధ్య‌క్షుడిగా ఉంటారా? లేక‌పోతే కొత్త‌వారికి అవ‌కాశం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.