Site icon HashtagU Telugu

KCR Govt: క‌రెంట్ చార్జీల పెంపుపై `పాత బ‌స్తీ` షాక్‌

Vijayashanthi

Vijayashanthi

పాత బ‌స్తీ వాసుల నుంచి విద్యుత్ బ‌కాయిలను కేసీఆర్ స‌ర్కార్ రాబ‌ట్ట‌లేక‌పోతోంది. సుమారు 4వేల కోట్లు ఓల్డ్ సిటీ బ‌కాయిలే. విద్యుత్ చార్జీల‌ను వ‌సూలు చేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న స‌ర్కార్ తెలంగాణ పౌరుల‌పై ఆ భారాన్ని వేస్తోంది. అదే విష‌యాన్ని బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి చెబుతోంది. విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర బీజేపీ వ్యతిరేకంగా నిరసనలకు దిగింది. ఆ క్ర‌మంలో పాత బ‌స్తీ బ‌కాయిల‌ను విజ‌య‌శాంతి బ‌య‌ట పెట్ట‌డం గ‌మ‌నార్హం. ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు, విద్యుత్ చార్జీలు పెంచుకుంటూ వెళుతోంది. పేద, మధ్యతరగతి ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం లూటీ చేస్తోందని విజ‌య‌శాంతి ఆరోపించారు. ప్రజల పక్షాన ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటానని బీజేపీ ఆమె హామీ ఇచ్చారు.
తెలంగాణ స‌ర్కార్ డిస్కామ్‌కు రూ.17,000 కోట్ల అప్పులు ఉంది. ఇందులో రూ.12,598 కోట్లు ప్రభుత్వ సంస్థల నుంచి ఉన్నాయని విజయశాంతి చెబుతోంది. మిగిలిన రూ.4,603 అప్పుల్లో హైదరాబాద్‌లోని పాత నగర ప్రజలు బిల్లులు చెల్లించకుండా తప్పించుకున్న కార‌ణంగా బ‌కాయి ఉంద‌ని వివ‌రించింది.

పాతబస్తీ ప్రజల నుంచి కరెంటు అప్పులు అడిగే దమ్ము కేసీఆర్ ప్రభుత్వానికి లేదని, అందుకే సామాన్య ప్రజలపై పూర్తి భారం మోపారని ఆమె విమ‌ర్శించారు. డిస్కమ్ చేసిన రూ.6,000 కోట్ల అప్పులు జ‌నం నుంచి వ‌సూలు చేయాల‌ని కేసీఆర్ సిద్ధ ప‌డ్డాడు. డిస్కమ్‌కు ప్రభుత్వమే రూ.48,000 కోట్ల అప్పులు చేయాల్సి ఉందని విజ‌య‌శాంతి గుర్తు చేశారు. ముందుగా డిస్కమ్‌కు బకాయిలు చెల్లించాలని, పాతబస్తీ ప్రజల నుంచి కూడా వసూలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. విద్యుత్ చార్జీలపై బీజేపీ త‌న పోరాటాన్ని కొన‌సాగిస్తుంద‌ని, ప్రభుత్వం దిగొచ్చే వ‌ర‌కు పోరాటం ఆగ‌ద‌ని క‌మ‌ల‌నాథులు హెచ్చ‌రించారు.