Site icon HashtagU Telugu

KCR Governament : వరంగ‌ల్ సెంట్ర‌ల్ జైలు తాక‌ట్టు! RBIకి ఫిర్యాదు

Kcr Governament

Kcr Governament

తెలంగాణ ప్ర‌భుత్వం(KCR Governament) విచ్చ‌ల‌విడిగా భూముల‌ను అమ్మేస్తోంది. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను త‌న‌ఖా పెడుతోంది. తాజాగా వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలును(Warangal jail) కుద‌వ‌పెట్టింది. ప‌లు ఆస్తుల‌ను తాక‌ట్టుపెడుతూ అభివృద్ధి అంటూ మోసం చేస్తోంద‌ని ఏఐసీసీ మాజీ స‌భ్యుడు బ‌క్కా జ‌డ్స‌న్ ఆరోపించారు. వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలును తాజాగా కుదువ‌పెట్ట‌డంపై ఆర్బీఐకి ఫిర్యాదు చేశారు. గ‌తంలో రాష్ట్రం చేసిన అప్పుల మీద కాగ్ లాంటి సంస్థ‌ల‌కు కూడా ఫిర్యాదు చేసిన ఆయ‌న అప్పుల చేయ‌డంపై మండిప‌డ్డారు.

తెలంగాణ ప్ర‌భుత్వం విచ్చ‌ల‌విడిగా భూముల‌ను(KCR Governament) 

గత డిసెంబర్ లో తెలంగాణ రాష్ట్రంలోని(KCR Governament) అన్ని చట్టబద్ధమైన, ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రత్యేక ఆడిట్ చేయాల‌ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకు అధికారులు, ఆర్థిక సంస్థల అధికారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ముంబైలోని RBI గవర్నర్ ను అభ్య‌ర్థించారు. తాజాగా వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలును తాక‌ట్టు పెట్టి ఋణం తీసుకోవ‌డంపై ఫిర్యాదు చేయ‌డం క‌ల‌కలం రేపుతోంది.

Also Read : CM KCR: సర్పంచులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. పంచాయతీలకు రూ.1190 కోట్లు!

తెలంగాణ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ (CIN U51900TG2015SGC098100) రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్ ద్వారా కాలానుగుణ అవసరాల ప్రకారం 45000 కోట్ల రుణాన్ని పొందింది. అయితే ఆ హామీలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ వాల్యూమ్ 5/Bలో నమోదు చేయబడలేదు (ఇది తాత్కాలిక రిస్క్ వెయిటేజీతో రాష్ట్ర ప్రభుత్వ హామీల జాబితా కోసం బడ్జెట్‌లో ప్రత్యేక వాల్యూమ్). ఇక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్( CIN U73100TG2016SGC111329) ఒక ఎత్తిపోత‌ల‌ ప్రాజెక్ట్. దీనికి తిరిగి చెల్లించే సామర్థ్యం లేదని, తెలంగాణ రాష్ట్ర హామీ ద్వారా కాలానుగుణంగా వివిధ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి 97,449.16 కోట్ల రుణాన్ని పొందింది. ప్రభుత్వం లోన్ మొత్తానికి తక్కువగా ఉన్న చరాస్తులు మరియు ప్రత్యక్ష ఆస్తులను ఊహించడం ద్వారా, REC Ltd ఈ ప్రాజెక్ట్‌లో ఆమోదం పొందని భాగానికి రూ.30536,08,00,000 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఇప్పటికే ప్రతిసంవత్సరం 13000 వేల కోట్ల ఈఎమ్డీ చెల్లించేలా ఒప్పందం ఉంది.

జైలును తాక‌ట్టు పెట్టి ఋణం తీసుకోవ‌డంపై ఫిర్యాదు

తాజాగా వరంగల్ సెంట్రల్ జైళ్లలో(Warangal jail) దొంగలు, చీటర్స్, ఫ్రాడ్లు, మోసగాండ్లు, రేపిస్టులు, మర్దరిస్టులు, తదితరులు ఉండే జైలనే కేసీఆర్ స‌ర్కార్ కుదువ‌పెట్టింది. బ్యాంకు అఫ్ మహారాష్ట్ర, లోకిమంగల్, శివాజీనగర్, పూణే బ్రాంచ్ నుండి 01/09/2022 న రూ.11,500000000 కోట్ల ఋణం తెలంగాణ సూపర్ స్పెషలిటి హాస్పిటల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎమ్డి డా. రమేష్ రెడ్డి s/o ధర్మారెడ్డి గారు మోర్తిగేజ్ చేసి తీసుకున్నారు. 2014 లో ముఖ్యమంత్రి కాగానే ఉస్మానియా, గాంధి దావఖానాలకు 100 కోట్లు ఇస్తానిని హామీ ఇచ్చిన కేసీఆర్ ఒక్క రూపాయి కుడా ఇవ్వలేదు. వరంగల్ ఎమ్జీఎమ్ దావఖనకు వసతులు కల్పించకుండా, పేషెంట్లను ఎలుకలకు అప్పాజెప్పిన ప్ర‌భుత్వం గత రుణాలకు అద‌నంగా మళ్ళి సూపర్ స్పెషలిటి హాస్పిటల్ నిర్మాణం పేరుతో రుణాల‌ను తీసుకోవ‌డం అవినీతి దాగిన అంశంగా జ‌డ్స‌న్ ఆరోపించారు. కాంట్రాక్టర్లకు అనుకూలంగా ప్రజా సంపదను దోచుకోవాలనే ఉద్దేశంలో ఇలా పెద్ద ఎత్తున రుణాల‌ను తీసుకుంటూ రాష్ట్రాన్ని(KCR Governament) అప్పుల పాటు చేస్తున్నార‌ని జ‌డ్స‌న్ ఆర్బీఐకి ఫిర్యాదు చేయ‌డం జరిగింది.

Also Read : CM KCR: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరణ