Site icon HashtagU Telugu

Telangana Elections 2023 : ఆటో డ్రైవర్ల కోసం గులాబీ బాస్ కొత్త హామీ

Kcr Good News

Kcr Good News

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ (BRS) తో పాటు కాంగ్రెస్ (Congress) , బిజెపి (BJP) ,BSP ఇలా అన్ని పార్టీలు ఉచిత హామీలను ప్రకటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నాయి. ఇక అధికార పార్టీ బిఆర్ఎస్ సైతం రెండుసార్లు అధికారం చేపట్టి…ఇప్పుడు మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ సాధించాలని గట్టిగా శ్రమిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రచారంలో సరికొత్త హామీలను ప్రకటిస్తూ గులాబీ బాస్ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటీకే కొత్త పథకాలతో పాటు పలు హామీలను తెలుపుతూ మేనిఫెస్టో ను రిలీజ్ చేసిన కేసీఆర్ (KCR)..ఇక ప్రజా ఆశీర్వద సభల్లో మరికొన్ని హామీలను ప్రకటిస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కరీంనగర్‌ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ ఆటో డ్రైవర్ల (Auto Drivers)కు శుభవార్త తెలిపారు. ఆటోరిక్షా వాళ్లకు వచ్చే ఆదాయం తక్కువ. మోడీ విపరీతంగా డీజిల్‌ ధర పెంచే కుసుండు. దేశవ్యాప్తంగా ఆటో రిక్షా కార్మికుల దగ్గర ముక్కుపిండి పన్ను వసూలు చేస్తున్నాడు. అందుకే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్యాసింజర్ ఆటోలకు ఫిట్‌నెస్, పర్మిట్ ఫీజు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఫిట్‌నెస్ ఫీజు రూ.750, పర్మిట్ ఫీజు రూ. 500 మాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ హామీ పట్ల ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరీంనగర్‌కు నాకు ఏదో శ్రుతి ఉన్నది. కరీంనగర్‌ భీముడు కమలాకర్‌ మొన్న అన్నడు. మీకు కరీంనగర్‌కు ఏదో లింక్‌ ఉన్నది సార్‌ అన్నడు. లింక్‌ అయితే ఉన్నదనుకో ఇక్కడి నుంచే పెళ్లి చేసుకున్న. కరీంనగర్‌ పిల్లనే పెళ్లి చేసుకున్న. నేను కరీంనగర్‌ ఎప్పుడు వచ్చినా ఏదో స్కీమ్‌ ప్రకటిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలోని ఆటో కార్మికులకు ఫిట్‌నెస్‌ ఛార్జి, సర్టిఫికెట్‌ ఛార్జీలను రద్దు చేస్తాం. తక్కువ ఆదాయం ఉన్న ప్రజలకు అందరికీ అన్నీ చేసుకుంటూ పోతున్నాం’ అని సీఎం కేసీఆర్‌ చెప్పుకొచ్చారు.

Read Also : Pawan Kalyan Election campaign : వరంగల్ లో పవన్ ఎన్నికల ప్రచారం..ఫుల్ జోష్ లో బిజెపి , జనసేన

Exit mobile version