బిఆర్ఎస్ పార్టీ లో కవిత వ్యవహారం (Kavitha Issue) తలనొప్పిగా మారింది. కేటీఆర్ , హరీష్ రావు లపై పరోక్షంగా విమర్శలు చేయడం , కేసీఆర్ (KCR) కు లేఖ రాయడం వంటి అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. రోజు రోజుకు కవిత దూకుడు ఎక్కువైపోతుండడం తో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. కేటీఆర్ – కవిత మధ్య ఉద్రిక్తత మరింతగా పెరగకముందే సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఆయన తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం పార్టీపై ప్రభావం చూపే ప్రకటనలు గానీ చర్యలు గానీ దూరం చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Bhairavam Movie Review: భైరవం మూవీ రివ్యూ అండ్ రేటింగ్.!
కవిత వ్యవహారాన్ని లైట్ గా తీసుకోకుండా, పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ పదవుల్లో మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగింపు ప్రశ్నార్థకమవుతుంది. మరోవైపు హరీష్ రావుకు పార్టీ లో ప్రముఖ పదవి ఇచ్చే అవకాశాలపై ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే వీటిపై త్వరిత నిర్ణయాలు తీసుకుంటే ప్రతికూల సంకేతాలు వెలుతాయని నేతలు హెచ్చరిస్తుండగా, వచ్చే వారం కేసీఆర్ ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామాలు బీఆర్ఎస్ లో కీలక మలుపుకు దారి తీసే అవకాశముంది.