Site icon HashtagU Telugu

KCR Gift : చంద్ర‌బాబు చెప్పేది నిజమే! కేసీఆర్ నోట ప్ర‌శంస‌!!

Kcr Gift

Kcr Gift

మ‌రోసారి చంద్ర‌బాబునాయుడ్ని (KCR Gift) వాడేసుకోవ‌డానికి కేసీఆర్ ప‌న్నాగం ర‌చించారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లో నెగిటివ్ కోణంలో చంద్ర‌బాబును బూచిగా చూపించారు. ఈసారి పాజిటివ్ కోణంలో చంద్ర‌బాబునూ చూపించ‌డం ద్వారా ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందాల‌ను కేసీఆర్ వ్యూహాన్ని ర‌చించారు. దాన్ని ప‌టాన్ చెరువు వేదిక‌గా ప్ర‌యోగించారు.

మ‌రోసారి చంద్ర‌బాబునాయుడ్ని వాడేసుకోవ‌డానికి కేసీఆర్ ప‌న్నాగం(KCR Gift) 

ద‌శాబ్ది ఉత్స‌వాల్లో భాగంగా కేసీఆర్ పాల్గొన్న ప‌టాన్ చెరువు స‌భ‌లో చంద్ర‌బాబును పాజిటివ్ కోణం (KCR Gift) చూపించారు కేసీఆర్. ఎలాగంటే, చంద్ర‌బాబు ఎప్పుడ‌న్నాడో తెలియ‌దుగానీ, హైద‌రాబాద్ లో ఒక ఎక‌రం అమ్ముకుంటే ఆంధ్రాలో 50 ఎక‌రాలు వ‌స్తుంద‌ని చెప్పార‌ని గుర్తు చేశారు. అంత‌లో బీఆర్ఎస్ నేత మ‌హిపాల్ రెడ్డి అందించిన స‌మాచారంతో ప‌టాన్ చెరువ‌లో ఒక ఎక‌రం రూ. 30కోట్లు అమ్ముతుంద‌ని అన్నారు. అంటే, ప‌టాన్ చెరువులో ఒక ఎక‌రం అమ్మితే, ఆంధ్రాలో 100 ఎక‌రాలు వ‌స్తుంద‌ని కేసీఆర్ తెలంగాణ అభివృద్ధిని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

బంగారు తెలంగాణ అనే ప‌దాన్ని ఉప‌యోగించ‌డం ద్వారా టీడీపీని ఖ‌తం

మూడోసారి సీఎం కావ‌డానికి చంద్ర‌బాబు భుజం(KCR Gift) మీద తెలంగాణ అభివృద్ధి అనే తుపాకీని పెట్టి ఓట్ల‌ను దండుకోవాల‌ని కేసీఆర్ చూస్తున్నారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లో తెలంగాణ విల‌న్ మాదిరిగా చంద్ర‌బాబును చిత్రీక‌రించారు కేసీఆర్. తెలంగాణ‌కు ప‌ట్టిన శ‌నిగా ఆయ‌న్ను అభివ‌ర్ణించారు. ఆంధ్రోళ్ల పెత్త‌నం చేయ‌డానికి వ‌స్తున్నార‌ని చంద్ర‌బాబును 2018 ఎన్నిక‌ల్లో బూచిగా చూపారు. ప్ర‌త్యేక రాష్ట్రాన్ని పులి నోట్ల త‌ల‌పెట్టి తెంచాన‌ని ప్ర‌జ‌ల్ని నమ్మించ‌డానికి చంద్ర‌బాబును స‌మైక్య‌వాదిగా చూపించారు. ఫ‌లితంగా 2014 ఎన్నిక‌ల్లో కేసీఆర్ కేవ‌లం 63 మంది ఎమ్మెల్యేల‌తో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ త‌రువాత విప‌క్షాల‌ను నిర్వీర్యం చేస్తూ అధికారాన్ని ఉప‌యోగించుకుని ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేల‌ను టీఆర్ఎస్ పార్టీకి తీసుకున్నారు. బంగారు తెలంగాణ అనే ప‌దాన్ని ఉప‌యోగించ‌డం ద్వారా టీడీపీని ఖ‌తం చేశారు. ఆ త‌రువాత 2018 ఎన్నిక‌ల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ద్వారా చంద్ర‌బాబు మ‌ళ్లీ తెలంగాణ వ‌స్తున్నాడ‌ని ప్ర‌చారం చేశారు. మ‌ళ్లీ ఆంధ్రా పెత్త‌నం కావాలా? అంటూ నిన‌దించారు. సీన్ క‌ట్ చేస్తే, రెండోసారి కేసీఆర్ ను సీఎం చేశారు తెలంగాణ ఓట‌ర్లు.

మాన‌వాభివృద్ధి సూచిక‌లో అట్ట‌డుగు ఉన్న తెలంగాణ

మూడోసారి సీఎం కావ‌డానికి రియ‌ల్ ఎస్టేట్ ధ‌ర‌ల పెరుగుదల‌ను ఈసారి కేసీఆర్ ప‌దేప‌దే చెబుతున్నారు. తెలంగాణ‌లో మారుమూల గ్రామాల‌కు వెళ్లిన‌ప్ప‌టికీ రూ. 30ల‌క్ష‌ల‌కు త‌క్కువ‌గా ఎక‌రం పొలం దొర‌క‌డంలేద‌ని హైప్ (KCR Gift) చేస్తున్నారు. గ‌త తొమ్మిదేళ్లుగా కేసీఆర్ స‌ర్కార్ చేసిన రియ‌ల్ ఎస్టేట్ హైప్ కార‌ణంగా సామాన్యులు బ‌త‌క‌లేని ప‌రిస్థితికి హైద‌రాబాద్ ను తీసుకొచ్చారు. గ‌తంలో ఎక్క‌డా బ‌త‌క‌లేనోడు కూడా భాగ్య‌న‌గ‌రంలో బ‌త‌క‌డానికి క‌డుపు చేత‌ప‌ట్టుకుని వ‌చ్చే వాళ్లు. ఇప్పుడు కేవ‌లం కోటీశ్వ‌రుల‌కు మాత్ర‌మే హైద‌రాబాద్ అనే రీతిలో చేసిన కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నారు. మాన‌వాభివృద్ధి సూచిక‌లో అట్ట‌డుగుల ఉన్న తెలంగాణ ర్యాంకును ఆయ‌న ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ స‌మాజం ఇప్ప‌టికీ చంద్ర‌బాబు క‌ష్టాన్ని, విజ‌న్ ను గుర్తించ‌క‌పోవ‌డం

వాస్త‌వంగా చంద్ర‌బాబు 20ఏళ్ల క్రితం ర‌చించిన 2020 విజ‌న్ ప్ర‌కారం (KCR Gift) ప్ర‌తి ఇంటికీ మంచినీళ్లు, 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా అనే అంశాలు ప్ర‌ధాన‌మైన‌వి. అంతేకాదు, హైద‌రాబాద్ కు ప్ర‌పంచ స్థాయి డిజైన్ ను అప్పుడే 2020 విజ‌న్ లో త‌యారు చేశారు. దాన్ని చెడ‌గొట్ట‌కుండా కేసీఆర్ కాపాడార‌ని చంద్ర‌బాబు చెప్పారు. అందుకే, ఇప్పుడు హైద‌రాబాద్ అమెరికా మాదిరిగా క‌నిపిస్తుంద‌ని ఎక్క‌డ‌కు వెళ్లినా చంద్ర‌బాబు చెబుతున్నారు. ఆ విష‌యాన్ని వ‌దిలేసి తానే 24 గంట‌ల విద్యుత్, ప్ర‌తి ఇంటికీ మంచినీళ్లు ఇస్తున్న‌ట్టు కేసీఆర్ ప్ర‌చారం చేసుకుంటున్నారు. భూముల ధ‌ర‌లు పెర‌గ‌డాన్ని త‌న ఇమేజ్ కింద జ‌మ చేసుకుంటున్నారు. అదంతా 20 ఏళ్ల క్రిత‌మే చంద్ర‌బాబు వేసిన బీజం. ఇప్పుడు వృక్ష‌మై కాయ‌లు కాస్తోంది. వాటిని తింటున్న కేసీఆర్, (KCR Gift) తెలంగాణ స‌మాజం ఇప్ప‌టికీ చంద్ర‌బాబు క‌ష్టాన్ని, విజ‌న్ ను గుర్తించ‌క‌పోవ‌డం విచిత్రం.

విజ‌న్ ప్ర‌కారం 2020 నాటికి విద్యుత్ ను అమ్మే రాష్ట్రంగా తెలంగాణ (KCR Gift)

అప్ప‌ట్లో చంద్ర‌బాబు (KCR Gift) త‌యారు చేసిన విజ‌న్ ప్ర‌కారం 2020 నాటికి విద్యుత్ ను అమ్మే రాష్ట్రంగా తెలంగాణ ఉండాలి. ప్ర‌ధాన సిటీల‌కు హైద‌రాబాద్ నుంచి విమాన సేవ‌లు రావాలి. ట్రాఫిక్ ర‌ద్దీ లేకుండా ఉండేలా సింగ‌పూర్ త‌ర‌హా రోడ్లు, ఫ్లైవోవ‌ర్లు, బైపాస్ లు రావాలి. న‌గ‌రం చుట్టూ ఎంఎంటీఎస్ సేవ‌లు విస్త‌రించాలి. సామాన్యుల‌కు కూడా ధ‌నికుల‌తో స‌మానంగా బ‌తికేలా డిజైన్ ఉంది. మాన‌వాభివృద్ధి సూచిక‌లో మొద‌టి స్థానంలో ఉండాల‌ని 20 ఏళ్ల క్రితం చంద్ర‌బాబు విజ‌న్ త‌యారు చేశారు. ఇప్పుడు కేసీఆర్ జ‌మానాలో పేదోడు మ‌రింత నిరుపేద‌గా, ధ‌న‌వంతులు కుబేరులుగా మారుతున్నారు. మ‌హాన‌గ‌రంలో ప్ర‌జ‌ల మ‌ధ్య అంత‌రం పెరిగిపోతోంది. ఫ‌లితంగా సామాజిక అస‌హ‌నం భాగ్య‌న‌గ‌రంలో నానాటీకి పెరుగుతోంది. దాని గురించి కేసీఆర్ ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం.

Also Read : KCR and Modi relation : విప‌క్షాల మీటింగ్ కు `నో ఇన్విటేష‌న్‌`, BJP బీ టీమ్ గా BRS కు ముద్ర‌!

ఖ‌రీదైన మెట్రో విస్త‌ర‌ణ మీద కేసీఆర్ స‌ర్కార్ దృష్టి పెట్టింది. మెట్రో విస్త‌ర‌ణ ఎన్నిక‌ల ప్ర‌చారాస్త్రంగా తీసుకున్నారు. ప‌టాన్ చెరువు నుంచి హ‌య‌త్ న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో కారిడార్ పొడిగిస్తామంటూ కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న స‌భ‌కుల్ని చ‌ప్ప‌ట్లు కొట్టేలా చేసింది. అదే, కేసీఆర్ చాతుర్యం. కానీ, ఆయ‌న ఏనాడూ ఎంఎంటీఎస్ న‌గ‌రం చుట్టూ తీసుకొస్తాన‌ని ప్రామిస్ చేయ‌లేదు. దాని వ‌ల‌న కేసీఆర్ కుటుంబానికి ఎలాంటి ముడ‌పులు అంద‌వు. అదే, మెట్రో విస్త‌ర‌ణ అయితే కాసులు రాల్చుతుంది. కిక్ బ్యాగ్ లు అందుకోవ‌చ్చు. సామాన్యుల ప్ర‌యాణించ‌లేని విధంగా పెరిగిన మెట్రో చార్జీల‌ను ఒక వైపు చూసే ప్ర‌జ‌ల‌తో చ‌ప్ప‌ట్లు కొట్టించుకోవ‌డం కేసీఆర్ చాతుర్యం. ఇదే ఒర‌వ‌డితో మూడోసారి సీఎం కావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రంగారెడ్డి, హైద‌రాబాద్ జిల్లాల్లో చంద్ర‌బాబు (KCR Gift) అంటే సానుభూతి ఉంది. దాన్ని కూడా వ‌ద‌ల‌కుండా వాడేసుకోవ‌డం కేసీఆర్ కు మాత్ర‌మే చెల్లింది.

Also Read : BRS MLAs: ఎమ్మెల్యేల డర్టీ పిక్చర్.. బీఆర్ఎస్ బేజార్!