Site icon HashtagU Telugu

Lok Sabha Polls : లోక్ సభ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన కేసీఆర్

Kcr Chevella

Kcr Chevella

లోక్ సభ ఎన్నికలకు సంబదించిన నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఈరోజు మంచి రోజు కావడం తో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్..బిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసి పలు సూచనలు తెలియజేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో గెలిచి తమ సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలో నేడు తెలంగాణ భవన్ లో పార్టీ అధినేత కేసీఆర్..పార్టీ విస్తృత సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా లోక్ సభ బరిలో పోటీకి దిగుతున్న 17 ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థుల‌కు బీ ఫారాలు అంద‌జేశారు. ఎన్నిక‌ల ఖ‌ర్చు నిమిత్తం ఒక్కో అభ్య‌ర్థికి రూ. 95 ల‌క్ష‌ల విలువ చేసే చెక్కుల‌ను కేసీఆర్ అందించారు. లోక్‌స‌భ ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహంపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అలాగే ఇప్పటి వరకు 8 లోక్ సభ సీట్లలో బీఆర్ఎస్ గెలుస్తోందని.. మరో మూడు స్థానాల్లో విజయావకాశాలున్నాయని కుండబద్దలు కొట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేఖత ఉందని.. దానిని అనుకూలంగా మల్చుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అలాగే ఈ నెల 22 నుంచి రోడ్డు షోలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని రెండు, మూడు అసెంబ్లీ ఏరియాల్లో రోడ్‌షోలు ఉండబోతాయని ఆ మేరకు షెడ్యూల్ ఫిక్స్ చేసినట్లు తెలిపారు. రోజుకు రెండు, మూడు రోడ్‌షోలు ఉంటాయని , ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు రైతుల వ‌ద్ద‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. సాయంత్రం వేళ రోడ్డు షోలు, కార్న‌ర్ మీటింగ్స్ నిర్వ‌హించ‌నున్నారు. వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ సెంట‌ర్ల‌లో భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఇక నుండి ఉద్య‌మ‌కాలం నాటి కేసీఆర్‌ను మ‌ళ్లీ చూస్తారు తెలిపి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

Read Also : Beerapottu Pachikaram : బీరపొట్టు – పచ్చికారం.. ఇలా ట్రై చేస్తే చాలా కమ్మగా ఉంటుంది

Exit mobile version