Site icon HashtagU Telugu

Sr NTR : ఎన్టీఆర్ భావంలో కేసీఆర్ భావ‌జాలం

Kcr Sr Ntr

Kcr Sr Ntr

`కేంద్రం మిథ్య‌.. గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ వ్య‌ర్థం..’స‌మాజానికి తెల్ల ఏనుగులు అవ‌స‌రంలేదు..’ అంటూ స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఆయ‌న తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలి రోజుల్లో అన్నాడు. అప్ప‌ట్లో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం క‌లిగించాయి. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ కొత్త రాజ్యాంగం దేశానికి అవ‌స‌రం మంటూ వినిపిస్తున్నాడు. కొత్త ఆలోచ‌న‌,కొత్త దిశ‌, కొత్త రాజ్యాంగం అవ‌స‌ర‌మ‌ని కేసీఆర్ అంటున్నాడు.ఇప్పుడు వ్య‌వ‌స్థ‌తో మార్పు రాద‌ని గంటాప‌థం చెబుతున్నాడు. రాజ్యాంగం మార్పు కోసం త్వ‌ర‌లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ ఎస్ ల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించి ఎజెండా త‌యారు చేస్తాన‌ని వెల్ల‌డించారు.ఆ ఎజెండాను దేశం ముందు ఉంచుతాన‌ని ప్ర‌క‌టించాడు.2018 ఎన్నిక‌లకు ముందు దేశానికి కాంగ్రెస్, బీజేపీయేత‌ర ప్ర‌భుత్వం అవ‌స‌ర‌మ‌ని కేసీఆర్ ప్ర‌చారం చేశాడు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా అడుగులు వేశాడు. వివిధ రాష్ట్రాల‌కు వెళ్లి..అక్క‌డి పార్టీల అధిప‌తుల‌తో స‌మావేశాల‌ను నిర్వ‌హించాడు. ఇప్పుడు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ నుంచి ఆయ‌న వెన‌క్కు తిరిగాడు. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చాల‌నే ప్ర‌తిపాద‌న దేశం ముందు ఉంచుతున్నాడు. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న బీజేపీ అనుస‌రిస్తోన్న విధానాల‌ను తూర్పురాబ‌ట్టాడు.అంతేకాదు, మోడీ వ్య‌క్తిగ‌తం జీవ‌నంపై కూడా వెళ్లాడు. ఆయ‌న వేసిన డ్ర‌స్ ల మీద జోకులు వేస్తూ ఆలోచింప చేశాడు. బెంగాల్ వెళ్లి ఠాగూర్ వేషం, త‌మిళ‌నాడు వెళ్లి లుంగీలు క‌ట్ట‌డం వ‌లన దేశం మారిపోద‌ని వ్యంగ్యాస్త్రాల‌ను సంధించాడు. అంతేకాదు, మెద‌డులేని ప్ర‌భుత్వం న‌డుస్తోంద‌ని దుయ్యబ‌ట్టాడు.

రాబోవు రోజుల్లో దేశ వ్యాప్తంగా కొత్త ప్ర‌భుత్వం అవ‌స‌ర‌మ‌ని కేసీఆర్ భావిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో వ‌న‌రుల‌ను స‌ద్విన‌యోగం చేసుకోలేని ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం ఉంద‌ని ఆయ‌న చెబుతున్నాడు. సింగ‌పూర్ లాంటి దేశాలు ఎలా చేస్తున్నాయో..చూసి నేర్చుకోవాల‌ని మోడీ సర్కార్ కు చుర‌క‌లు వేశాడు. ప‌లు దేశాలు ప‌రిస్థితుల‌కు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకున్నాయ‌ని గుర్తు చేశాడు. ఇప్పుడు ప‌రిస్థితుల్లో కొత్త ఆలోచ‌న‌, కొత్త దిశ‌కు అనుగుణంగా రాజ్యాంగాన్ని రాయాల‌ని కేసీఆర్ ప్ర‌ధాన ఎజెండాను ఫిక్స్ చేశాడు.వాస్త‌వంగా స్వాతంత్ర్య వ‌చ్చిన త‌రువాత బాబూరాజేంద్ర‌ప్ర‌సాద్ అధ్య‌క్షునిగా ఏర్ప‌డిన క‌మిటీ రాజ్యాంగాన్ని ర‌చించింది. ఆ క‌మిటీలో అంబేద్క‌ర్ స‌భ్యునిగా ఉన్నాడు. ఆ రోజు 12 మందితో ఏర్ప‌డిన క‌మిటీలోని స‌భ్యులంద‌రూ నిపుణులు. కొన్నేళ్ల పాటు అధ్య‌య‌నం చేసిన త‌రువాత రాసిన భార‌త రాజ్యాంగం ఇప్పుడు ఉంది. 73వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వాల‌ను కూడా వారం క్రితం జ‌రుపుకున్నాం. ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని కేసీఆర్ త‌ప్పు బడుతున్నాడు. ఆ రాజ్యాంగాన్ని యాథాత‌దంగా ఇప్ప‌టికీ అమ‌లు చేయ‌లేక ప్ర‌భుత్వం వైఫ‌ల్యం చెందుతోన్న మాట వాస్త‌వం. అందుకే, ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి ప్ర‌భుత్వాల‌ను మార్చుకునే అవ‌కాశం రాజ్యాంగం క‌ల్పించింది.

ఇప్పుడున్న రాజ్యాంగం ప్ర‌కారం కేసీఆర్ ప్ర‌భుత్వం న‌డుస్తుందా? అని ప్ర‌శ్న వేసుకుంటే వ‌చ్చే స‌మాధానం అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు వ్య‌వ‌స్థ‌ను మార్చుకోవ‌డానికి రాజ్యాంగాన్ని అమ‌లు చేయాలి. దాన్ని య‌ధాత‌థంగా అమ‌లు చేస్తే, మ‌రుక్ష‌ణం కేసీఆర్ జైలులో ఉంటాడ‌ని ఓ సామాజిక కార్య‌క‌ర్త త‌న మ‌నోభావాన్ని వ్య‌క్తం చేశాడు. రాజ్యాంగాన్ని మార్చాల‌ని కేసీఆర్ అంటోన్న విష‌యాన్ని సామాజిక కార్య‌క‌ర్త వ‌ద్ద ప్ర‌స్తావించ‌గా…అమ‌లు చేస్తే తెలుస్తుంద‌ని కేసీఆర్ కు చుర‌క‌లు వేశాడు. రాజ్యాంగంలోని కొన్ని ప‌దాలు కూడా కేసీఆర్ కు తెలియ‌వ‌ని మండిప‌డ్డాడు. రాజ్యాంగం రాసిన వాళ్ల నైపుణ్యం, వాళ్ల ఉన్న‌త చ‌ద‌వుల‌ను గ‌మ‌నించాల‌ని చుర‌క‌లు వేశాడు. రాజ్యాంగం ప్ర‌కారం కేసీఆర్ ప్ర‌భుత్వం న‌డుస్తుందా? అంటూ ప్ర‌శ్నించాడు. ఒక వేళ రాజ్యాంగం ప్ర‌కారం కేసీఆర్ ప్ర‌భుత్వం న‌డిస్తే…ఆ కుటుంబం మొత్తం జైలులో ఉంటుంద‌ని ఆ సామాజిక కార్య‌క‌ర్త అభిప్రాయం.భార‌త రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోన్న వాళ్ల‌లో రాజ‌కీయ‌నేత‌లు ఎక్కువ‌. వాస్త‌వంగా స్వాతంత్ర్యం వ‌చ్చిన తొలి రోజుల్లో భార‌త రూపీ, అమెరికా డాల‌ర్ కు స‌మానంగా ఉండేది. ఆ త‌రువాత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాజ‌కీయ నేత‌లు వేసిన అడుగులు ఇప్పుడు భార‌త రూపీకి విలువ లేకుండా పోయింది. ఆమెరికా డాల‌ర్ తో పోల్చుకుంటే, భార‌త రూపీ ఎంత దిగ‌జారిందో చూస్తున్నాం. ఇక బ్లాక్ మ‌నీ ఏ విధంగా పారిశ్రామివేత్త‌లు, రాజ‌కీయ నాయ‌కులు కూడ‌బెతున్నారో చూస్తున్నాం. ఆ బ్లాక్ మ‌నీ బ‌య‌ట‌కు తీసుకొస్తాన‌ని అధికారంలోకి వ‌చ్చిన మోడీ ఏమి చేశాడో…ఈ ఏడేళ్ల‌లో అర్థం అయింది. రాజ్యాంగ ఉల్లంఘ‌న కేంద్రం నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వాల వ‌ర‌కు ఎలా పాల్ప‌డుతున్నాయో..అంద‌రికీ తెలిసిందే. రాజ్యాంగాన్ని య‌థాత‌దంగా అమ‌లు చేయ‌డానికి ద‌మ్ములేని కేసీఆర్ దాన్ని మార్చేయాల‌ని ఎజెండా ను ఫిక్స్ చేయ‌డం వ విడ్డూరం. ఆనాడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఇప్పుడు కేసీఆర్ కామెంట్స్ కు చాలా తేడా ఉంది. రాజ్యాంగాన్ని స‌వ‌రించుకోవాల‌నే అభిప్రాయాన్ని ఎన్టీఆర్ ఆనాడు వెలుబుచ్చాడు. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చేయాల‌ని ఎజెండాను ఫిక్స్ చేయ‌డంపై ప్ర‌జాస్వామ్య‌వాదులు మండిప‌డుతున్నారు. ఆయ‌న వ్యాఖ్య‌లు చివ‌ర‌కు ఎటు వైపు వెళ‌తాయో..చూద్దాం.!