Site icon HashtagU Telugu

KCR 1st Tweet : సోషల్ మీడియాలో కేసీఆర్ పెట్టిన ఫస్ట్ పోస్ట్ ..

Kcr 1st Tweet

Kcr 1st Tweet

ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) అనేది ఎంత ప్రభావం చూపుతుందో తెలియంది కాదు..ప్రపంచంలో ఏంజరిగిన కష్ణాల్లో మన కళ్ల ముందు ఉంచుతుంది..మంచి , చెడు , న్యాయం , అన్యాయం ఇలా ఏదైనా సరే ప్రజల్లోకి తీసుకెళ్లడం లో సోషల్ మీడియా అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇక రాజకీయ పార్టీలైతే సోషల్ మీడియా వేదికగా చేసుకొని ప్రజల్లోకి తమ పార్టీని తీసుకెళ్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది రాజకీయ, సినీ , బిజినెస్ , క్రీడా ఇలా అనేక రంగాల వారు సోషల్ మీడియా లోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తుండగా..ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్బంగా అధినేత కేసీఆర్ (KCR) సైతం సోషల్ మీడియా లో ఎంట్రీ ఇచ్చి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు.

We’re now on WhatsApp. Click to Join.

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మొదటి పోస్ట్ పెట్టారు. ”బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..!” అని కేసీఆర్ తన ఎక్స్ ఖాతాలో తొలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు వింటేజ్ లుక్‌లో ఉన్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలం నాటి ఫొటో జత చేశారు.

ప్రస్తుతం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీ గా ఉన్నారు. కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర కు ప్రజల నుండి విశేష స్పందన వస్తుండడం తో తన దూకుడు ను మరింత పెంచుతూ..పదునైన మాటలను వదులుతూ అధికార పార్టీ ఫై నిప్పులు చెరుగుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలంతా బిఆర్ఎస్ ను గెలిపించాలని కోరుతున్నారు. మళ్లీ బిఆర్ఎస్ పార్టీ వస్తుందని..ప్రజల కష్టాలు తీరుతాయని భరోసా ఇస్తున్నారు.

Read Also : Minister Seediri Appalraju: ఎన్నికల అధికారిని బెదిరించిన వైసీపీ మంత్రి అప్పల్రాజు