KCR Press Conference: కేసీఆర్ మాట్లాడిన పది అంశాలు ఇవే

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు

  • Written By:
  • Updated On - November 7, 2021 / 08:38 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో రాష్ట్రంలోని పలు అంశాల పట్ల ప్రభుత్వ విధానాలను తెలపడంతో పాటు రాజకీయ విమర్శలు చేశారు.

సీఎం కేసీఆర్ మాట్లాడిన ముఖ్యమైన విషయాలు ఆయన మాటల్లోనే

1. ధాన్యం కొననని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తేల్చి చెప్పడం వల్లే వరి పంట వేయొద్దని రైతులకు సూచించాం. వరికి బదులు వేరే 9 పంటలకు సంబందించిన విత్తనాలను కూడా తెచ్చి పెట్టాం. కేంద్రం తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయం వల్లే ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

2. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం అద్భుతమైన అబద్దం చెప్పింది. నాలుగు రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల కోసం బీజేపీ పెట్రోల్ రేట్లను తగ్గించింది. బీజేపీ అధికారంలోకి రాకముందు ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగకున్నా, బీజేపీ పెట్రోల్ ధరలు పెంచింది. ప్రజల మీద ప్రేమ ఉంటే కేంద్రం ఇంధన ధరలపై సెస్ పూర్తిగా తగ్గించాలి.

3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిన్నోడు. స్థాయికి మించి మాట్లాడుతున్నాడు. చిల్లరగా మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు పోనీ అని సంయమనం పాటించాను. బండి సంజయ్ నన్ను జైలుకు పంపుతా అన్నాడు. నన్ను టచ్ చేసి బతుకగలడా? బండి సంజయ్ మెడలు విరుస్తాం. నేను అవినీతి చేసిన అని ఆధారాలుంటే విచారణ జరిపించండి.

4. ఉత్తర భారత్ లోని రైతుల పోరాటంలో భాగమవుతాం. పెట్రోల్ ధరలు తగ్గించాలని ధర్నా చేస్తాం. కేంద్రం విధానాలపై పోరాటం చేస్తాం. కేంద్రాన్ని నిద్రపోనివ్వం. రాష్ట్ర బీజేపీ నేతలను రోడ్లపై తిరగనివ్వం. బండి సంజయ్ నీకు వార్నింగ్ ఇస్తున్నా. దమ్ముంటే ఢిల్లీ వెళ్లి ధాన్యాన్ని కొంటామని కేంద్రాన్ని ఒప్పించు.

5. దళితబంధు పధకం మా ఎజెండా. ఆ పధకాన్ని వందకు వంద శాతం అమలుచేసి తీరుతాం. దళితులు, గిరిజనుల కోసం తెచ్చిన చట్టాలను లొట్టపీసు చట్టాలని బీజేపీ నేతలు అంటున్నారు. ఎన్నికలచ్చినప్పుడల్లా బీజేపీ నాయకులు భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీలు పదిపైసల పని కూడా చేయలేదు. రేపటినుండి దేశంలో అగ్గిపెడుతాం.

6. రాజకీయ పార్టీకి గెలుపు ఓటములు సహజం. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలప్పుడు గెలిచాం. హుజురాబాద్ లో ఓడిపోయాం. దానికే ప్రజలు తిరస్కరించారని అంటే మొన్నటి ఉప ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది దానర్ధం బీజేపీని ప్రజలు తిరస్కరించినట్టేనా?

Also Read : రాహుల్ గాంధీ ప్రధాని అయితే చేసే మొదటి పని?7. తెలంగాణ రైతులను

మోసం చేయాలని చూస్తే మెడలు నాలుగు ముక్కలు చేస్తా. బీజేపీ వల్లే అన్ని ధరలు పెరిగాయి. కిషన్ రెడ్డి కూడా తప్పులు మాట్లాడుతున్నాడు. అది కిషన్ రెడ్డికి మంచిది కాదు.

8. తెలంగాణ క్యాబినెట్, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులను తీసుకెళ్లి ఢిల్లీలో ధర్నా చేస్తా. పంజాబ్ లో మొత్తం ధాన్యాన్ని సేకరించి, తెలంగాణలో ధాన్యాన్ని ఎందుకు సేకరించరు?

9. తెలంగాణ నీటి వాట తేల్చడానికి కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోంది? ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు?
ఇన్ని రోజులు ఓపికగా ఉన్నాం, ఇకపై రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రకాల పోరాటాలు చేస్తాం.

Also Read: ఆదిశంకరాచార్యుడిని చెక్కిన యువకుడు – అరుణ్ యోగిరాజ్

10. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటినుండి పెట్రోల్, డీజిల్ పై ఒక్కపైసా వ్యాట్ పెంచలేదు. కాబట్టి ఇప్పుడు ఒక్కపైసా కూడా తగ్గించం. పెంచిన వాళ్లే తగ్గించాలి. పెంచిన వ్యాట్, సెస్ తగ్గించేదాకా బీజేపీపై కొట్లాడుతాము.