Site icon HashtagU Telugu

KCR : బిఆర్ఎస్ గెలిస్తే రైతుబంధు ఉంటది..కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు పోతది – కేసీఆర్

Kcr Fire On Cng Bjp

Kcr Fire On Cng Bjp

బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ (CM KCR) తన వయసును సైతం ఏ మాత్రం లెక్క చేయకుండా వరుసగా జిల్లాల పర్యటన చేస్తూ బిజీ గా మారారు. గతంలో ఏ రేంజ్ లో అయన కష్టపడలేదనే చెప్పాలి. గత కొద్దీ రోజులుగా ప్రజా ఆశీర్వాద సభ (Praja Ashirvada Sabha) లతో పర్యటిస్తూ వస్తున్నారు. నిన్న అశ్వరావుపేట, పినపాక, భద్రాచలంతో పాటు నర్సంపేటలో ప్రజా ఆశీర్వాద సభలలో ఆయన పాల్గొన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ అభివృద్ధి…సంక్షేమ పధకాలు , 24 గంటల కరెంట్ ఇలా అన్ని ప్రజలకు వివరిస్తూ..మరోసారి బిఆర్ఎస్ కు అధికారం ఇవ్వాలని కోరుతూ వస్తున్నాడు. ఇదే క్రమంలో కాంగ్రెస్ (Congress) , బిజెపి (BJP) లపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నేడు పాలకుర్తి, నాగార్జున సాగర్ (హాలియా), ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు మాకు ఒక్క ఛాన్స్‌ ఇయ్యండి అంటున్నరు. వాళ్లకు ఒక్క ఛాన్స్‌ కాదు, ప్రజలు ఇప్పటికే 10, 11 ఛాన్స్‌లు ఇచ్చారు. మరె ప్రజల కోసం వాళ్లు ఏంజేసిండ్రు..? కనీసం కృష్ణా, గోదావరి నదుల నుంచి మంచి నీళ్లయినా తెచ్చియ్యగలిగిండ్రా..? పైంగ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంల వేస్తరట. ఏకంగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధే ఈ మాట అంటున్నడు. ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు అదే పాట పాడుతున్నరు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు పోతది అని మరోసారి కేసీఆర్ చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తీసుకొచ్చిన ప్రజాసంక్షేమ పథకాలన్నీ అక్కర్లేదని, తాము అధికారంలోకి రాగానే వాటిని తీసేస్తమని కాంగ్రెసోళ్లు చెబుతున్నరని, కాబట్టి ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్‌ కోరారు.

అలాగే బిజెపి పార్టీ ఫై కూడా కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు. బావుల కాడ మీట‌ర్లు పెట్టాల‌ని ప్రధాని మోడీ బెదిరించాడు. చ‌చ్చినా పెట్ట‌ను అని తేల్చి చెప్పా.. మీట‌ర్లు పెట్టాలి.. బిల్లులు వ‌సూళ్లు చేయాల‌న్నాడు. పెట్ట‌ను అని చెప్పాను. సంవ‌త్స‌రానికి రూ. 5 వేల కోట్లు బ‌డ్జెట్ క‌ట్ చేస్తా అని అంటే క‌ట్ చేసుకో అని మోడీకి చెప్పాను. ఐదేళ్లకు రూ. 25 వేల కోట్లు మ‌న‌కు వ‌చ్చేవి క‌ట్ చేసిండు మోడీ. అయినా కూడా నేను కాంప్ర‌మైజ్ కాలేదు.. మీట‌ర్లు పెట్ట‌లేదు. 24 గంట‌ల క‌రెంట్ ఆప‌లేదు. రేపు బీజేపోడు వ‌చ్చి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగ‌త‌డు. ఎందుకు వేయాలి మ‌నం బీజేపీ ఓటు అని ప్రశ్నించారు.

Read Also : Revanth : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఫ్యామిలీ కరెంట్ ఊడగొడుతం – రేవంత్ సంచలన వ్యాఖ్యలు