KCR : 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైంది – కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైంది. ఏ ఒక్క విషయంలోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదు, వసతులు, వనరులను కాపాడుకునే నైపుణ్యం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదు

  • Written By:
  • Publish Date - April 13, 2024 / 07:59 PM IST

లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్..చేవెళ్ల సభ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. నాల్గు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైందంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)..ఇప్పుడు లోక్ సభ (Lok Sabha) ఎన్నికలతో తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా అనేక వ్యూహాలు రచిస్తూ..అధికార పార్టీ కాంగ్రెస్ ను , కేంద్రంలోని బిజెపి(BJP)ని దెబ్బ తీయాలని పిలుపునిస్తూ వస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ , నల్గొండ లలో భారీ బహిరంగ సభలు నిర్వహించి బిఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్..ఈరోజు చేవెళ్ల (Chevella ) లో ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు.

We’re now on WhatsApp. Click to Join.

రాజ‌కీయాలు , ఎన్నిక‌లు వ‌స్తుంటాయి, పోతుంటాయి. కానీ ప్ర‌జానీకానికి ప్ర‌భుత్వం అంటే ఒక ధీమా, ఒక‌ ధైర్యం. మా ప్ర‌భుత్వం ఉంది మ‌మ్మ‌ల్ని ఆదుకుంటుంద‌నే విశ్వాసం ఉండాలి. ప్ర‌జ‌లు కోరుకునేది అదే. యావ‌త్ రాష్ట్ర ప్ర‌జానీకానికి ప్ర‌భుత్వం మీద ఆత్మ‌శిశ్వాసం ఉండాలి. ఈ మ‌ధ్య ఎన్నిక‌ల్లో నేను చాలా స‌భ‌ల్లో చేప్పుకొచ్చాను.. ఓటు వేసే ముందు జాగ్ర‌త్త‌గా ఆలోచించాలి అని కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంతులేని హామీలు, ప్ర‌లోభాల‌కు ఓట‌ర్లు గురయ్యారు. దీంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చింది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైంది. ఏ ఒక్క విషయంలోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదు, వసతులు, వనరులను కాపాడుకునే నైపుణ్యం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. 15ఏళ్లు పోరాటం చేసి సాధించిన తెలంగాణను మళ్లీ పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని కేసీఆర్ ఆరోపించారు.

తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులను కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా కాపాడుకుంటుందో అలా కాపాడుకున్నామని .. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం 5 పథకాలు తీసుకొచ్చామని, రైతుబంధుతో ఎకరానికి రూ.10వేలు , 24గంటల నాణ్యమైన కరెంట్, రైతు బీమా కింద రూ.5లక్షలు, పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసిందని కేసీఆర్ గుర్తు చేసారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది..కరువు వచ్చిందన్నారు. నీరు లేక రైతులు నానా అవస్ధలు పడుతున్నారు. పల్లెల్లో , పట్టణంలో తాగేందుకు నీరు లేక వాటర్ ట్యాంకర్ల కోసం ఎదురుచూసే కర్మ వచ్చింది. పదేళ్లలో వాటర్ ట్యాంకర్ అంటే తెలియని ప్రజలు..ఇప్పుడు వాటర్ ట్యాంకర్ కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చిందన్నారు.

Read Also :