Lok Sabha Polls : ఫస్ట్ టైం లోక్ సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరం

గత 20 ఏళ్లుగా కేసీఆర్ ఫ్యామిలీ నుండి ఎవరొకరు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. కానీ ఈసారి మాత్రం ఒక్కరు కూడా బరిలో నిల్చోలేదు.

  • Written By:
  • Publish Date - April 26, 2024 / 09:42 AM IST

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) సమరం కొనసాగుతుంది. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ పూర్తి కాగా..ఈరోజు 13 రాష్ట్రాల్లోని 88 లోక్ సభ స్థానాలకు రెండో దశ పోలింగ్ జరుగుతోంది. మే 13 న తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగబోతుంది. తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలకు , ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుండగా..ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు , 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 04 వీటికి సంబదించిన ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఈ లోక్ సభ ఎన్నికలకు మొదటిసారి కేసీఆర్ ఫ్యామిలీ దూరం గా ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

గత 20 ఏళ్లుగా కేసీఆర్ ఫ్యామిలీ (KCR Family) నుండి ఎవరొకరు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. కానీ ఈసారి మాత్రం ఒక్కరు కూడా బరిలో నిల్చోలేదు. 2001లో TRS ఆవిర్భావం తర్వాత 2004 ఎన్నికల్లో KCR కరీంనగర్ ఎంపీ గా పోటీ చేసి విజయం సాధించారు. 2006, 2008 ఉపఎన్నికల్లోనూ గెలుపొందారు. 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో గజ్వేల్ మ్మెల్యేగా, మెదక్ MPగా గెలిచి, MP పదవికి రాజీనామా చేశారు. 2014లో ఆయన కుమార్తె కవిత నిజామాబాద్ ఎంపీగా గెలుపొందారు. 2019లో ఓడిపోగా, ఈసారి పోటీలో లేరు. ఇలా మొత్తం 20 ఏళ్లుగా కేసీఆర్ ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు బరిలో నిల్చుగా ఈసారి మాత్రం అంత దూరంగా ఉన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయ్యి..తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తుంది. ఇటు కేసీఆర్ సైతం గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుండి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే కేటీఆర్ సిరిసిల్ల నుండి , హరీష్ రావు సిద్దిపేట నుండి ఎమ్మెల్యే లు గా గెలిచి అసెంబ్లీకి పరిమితం అయ్యారు. ప్రస్తుతం కేసీఆర్ ఫోకస్ అంత లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని చూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్ష పార్టీ కి పరిమితం అయ్యారు. మరోపక్క రాష్ట్రంలోని బిఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉండడంతో లోక్ సభ ఎన్నికలపై పట్టు సాధించి తమ సత్తా చాటాలని చూస్తున్నారు.

Read Also : Lok Sabha Elections : ప్రశాంతంగా కొనసాగుతున్న రెండో దశ పోలింగ్