KCR Interview: వైఎస్ఆర్ ఓట్లపై కన్నేసిన కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఆర్‌ఎస్ కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ రాజకీయ సంక్షోభం నుంచి బయటపడాలంటే కీలక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. ప్రస్తుతం దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలిదశ ఎన్నికలు పూర్తయ్యాయి.

KCR Interview: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఆర్‌ఎస్ కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ రాజకీయ సంక్షోభం నుంచి బయటపడాలంటే కీలక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. ప్రస్తుతం దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలిదశ ఎన్నికలు పూర్తయ్యాయి. త్వరలో ఏపీలో అసెంబ్లీ, లోకసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణలో లోకసభ ఎన్నికలుజరుగుతాయి. కాగా అసెంబ్లీలో పోగొట్టుకున్న క్యాడర్ని లోకసభ ద్వారానైనా తిరిగి రప్పించుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అయితే బీఆర్ఎస్ ఈ సారి వినూత్న పద్దతిలో ఓటర్లను ఆకట్టుకోనున్నట్లు తెలుస్తుంది.

కేసీఆర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిగిల్చిన వనరులను సద్వినియోగం చేసుకోలేని కాంగ్రె్‌సను తెలిసీతెలియని సీఎం అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. అయితే ఆసక్తికరంగా, వైఎస్ఆర్ మొదటగా రూపొందించిన సంక్షేమ పథకాలను తాను కొనసాగిస్తున్నానని బహిరంగంగా చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీని వెనుక రాజకీయ వ్యూహాంపై విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsAppClick to Join

సంగతి ఏంటంటే.. తెలంగాణలోని వైఎస్ఆర్ మద్దతు దారులను ఆకట్టుకునేందుకు కేసీఆర్ వైఎస్ఆర్ ని పొగిడినట్లు మాట్లాడుతుకుంటున్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ ప్రభావం లేకపోలేదు. వైఎస్ఆర్ పేరుతోనే షర్మిల తెలంగాణ కొత్త పార్టీ పెట్టారు. అయితే ఇప్పుడా పార్టీ లేదు. కానీ తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ మద్దతు దారులు ఏ ఒక్క పార్టీకో ఓటేసే పరిస్థితి లేదు. ఈ నేపధ్యలో కేసీఆర్ వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను తెరపైకి తీసుకొచ్చాడు అంటున్నారు వైఎస్‌ఆర్‌ రూపొందించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ పథకాలను కొనసాగించానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. దివంగత సిఎంపై సానుకూల వెలుగులు నింపడం ద్వారా మరియు ఆయన సంక్షేమ విధానాల ద్వారా వైఎస్ఆర్ మద్దతు దారులని బుజ్జగిస్తున్నట్లు కనిపిస్తోంది.

Also Read: Narendra Modi : ‘వన్‌ ఇయర్‌-వన్‌ పీఎం’.. ఇదే ఇండియా కూటమి సిద్ధాంతం