Site icon HashtagU Telugu

CM KCR : కర్ణాటక మృతుల కుటుంబాలకు కేసీఆర్ ఎక్స్ గ్రేషియా!

Kcr

Kcr

కర్ణాటకలోని కలబురగి జిల్లాలో శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన ఏడుగురి ప్రాణాలను బలిగొన్న ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు కమలాపూర్ సమీపంలో శుక్రవారం ఉదయం డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడగా, వారిని గుల్బర్గాలోని ఆసుపత్రికి తరలించారు. 8 మంది చనిపోయినట్టు సమాచారం. కేసీఆర్ సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. మృతదేహాలను తరలించడానికి, గాయపడిన వారికి సాధ్యమైనంత చికిత్స చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ యాదవ్‌లను ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతకుముందు, సంఘటన గురించి తెలిసిన వెంటనే, ముఖ్యమంత్రి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కర్ణాటక ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.