KCR: ఎన్నికల రణరంగంలోకి కేసీఆర్.. చేవేళ్ల భారీ బహిరంగ సభతో దూకుడు

  • Written By:
  • Updated On - March 28, 2024 / 10:27 AM IST

KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లోక్ సభ ఎన్నికల రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. చేవేళ్లలో ఆయన భారీ బహిరంగ సభను నిర్వహించి లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లేలా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గంలో 13న కెసిఆర్ బహిరంగ సభ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవటంతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్  పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే 17 స్థానాలకుగానూ అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR ఇక ఎన్నికల ప్రచారంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.

కాగా సామాజిక సమీకరణాల రీత్యా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు సులభం అవుతుంది అని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజులతోపాటు బీసీల కోసం కొన్ని దశాబ్దాలుగా అండగా నిలబడిన వ్యక్తి అని అన్నారు. ఒకవైపు బీసీల కోసం పాటుపడుతూనే, మరోవైపు అన్ని సామాజిక వర్గాలను, మైనార్టీలను కలుపుకుపోయిన మంచి మనిషి, నాయకుడు కాసాని అంటు కితాబు ఇచ్చారు.

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారంలో ప్రస్తావించాల్సిన అంశాలపై రోజుకో నియోజకవర్గం నేతలతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో చేవెళ్ల నుంచి విజయం సాధించిన రంజిత్ రెడ్డి ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్‌లో చేరారు. దీనిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ వీడిపోతున్న వారిని, ముఖ్యంగా ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. చేవేళ్లను బీఆరఎస్ తమ ఖాతాలో వేసుకొని ఫిక్స్ అయ్యింది.