CM KCR: ఎర్రవల్లి ఫాం హౌజ్‌లో ప్రజల్ని కలిసిన మాజీ సీఎం కేసీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు బుధవారం తొలిసారిగా ప్రజలని కలిశారు. సిద్దిపేట జిల్లా చింతమడకలోని తన స్వగ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను పలకరించేందుకు

CM KCR: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు బుధవారం తొలిసారిగా ప్రజలని కలిశారు. సిద్దిపేట జిల్లా చింతమడకలోని తన స్వగ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను పలకరించేందుకు ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారు. మధ్యాహ్నం కేసీఆర్‌ను క‌లిసేందుకు 9 బ‌స్సుల్లో 540 మంది ఎర్రవెల్లి ఫాం హౌస్ కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా బయటికి వచ్చిన కేసీఆర్ తన సొంతూరు ప్రజలు అందరికీ అభివాదం చేశారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాగానే జనం ‘సీఎం కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్‌ తో పాటు మేనల్లుడు, సిద్దిపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు కూడా ఉన్నాడు.

కేసీఆర్ ఈనెల 30న సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలో పర్యటించి ఓటు వేశారు. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. 119 మంది సభ్యుల అసెంబ్లీలో 64 స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. బీఆర్‌ఎస్ 39 సీట్లు గెలుచుకుంది. డిసెంబర్ 4న కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

Also Read: Ghee For Health: చలికాలంలో రోజు ఒక స్పూన్ నెయ్యి తింటే ఏం జరుగుతుంది తెలుసా?