KCR BRS: బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ ఏకగ్రీవం!

బీఆర్ఎస్ ఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.

  • Written By:
  • Updated On - December 9, 2023 / 10:51 AM IST

KCR BRS: బీఆర్ఎస్ ఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. బీఆర్ఎస్పీ పి నేత కేశవరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.అయితే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ పేరును ప్రతిపాదించగా మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి బలపరిచారు. శాసనా సభాపక్షం మిగతా కమిటీ ని ఎంపిక చేసే భాద్యతను కేసీఆర్ కు అప్పగిస్తూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.

నేటి నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా.. ప్రతిపక్ష హోదాలో బీఆర్‌ఎస్‌ అనుసరించాల్సిన విధానాలు, ఇతర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. అయితే కేసీఆర్‌ కూడా ఇందులో పాల్గొనాల్సి ఉండగా.. ఆయనకు యశోద ఆసుపత్రిలో తుంటి ఎముక సర్జరీ జరిగిన నేపథ్యంలో హాజరు కాలేకపోతున్నారు.

ఇక స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించేలా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. సమావేశం తర్వాత అందరూ కలిసి అసెంబ్లీకి వెళ్లి ప్రమాణ స్వీకారం చేస్తారు.  ఇన్నాళ్లు అధికార పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో విధంగా ఇముడుతుందో వేచి చూడాల్సిందే.