KCR ED : బిడ్డ‌కు KCR అభ‌యం,ED విచార‌ణ ఉత్తుదేనా?

`ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రంలేదు

  • Written By:
  • Publish Date - March 8, 2023 / 05:46 PM IST

`ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రంలేదు అంటూ బిడ్డ క‌విత‌కు తెలంగాణ సీఎం కేసీఆర్(KCR ED) ఇచ్చిన భ‌రోసా. ఆయ‌న ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బీజేపీ, బీఆర్ఎస్(BJP-BRS) మ‌ధ్య న‌డుస్తోన్న క్విడ్ ప్రో కో ను కాంగ్రెస్ బ‌య‌ట‌కు లాగుతోంది. నాలుగు నెల‌లుగా క‌విత అరెస్ట్ మీద ప‌లు ర‌కాల కామెంట్లు వింటున్నారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో ఇప్ప‌టికు 11 మంది ని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు అరెస్ట్ చేయ‌డం జ‌రిగింది. ప‌లు చార్జిషీట్ల‌లో క‌విత పేరును పొందుపరిచారు. అంతేకాదు, ఒక విడ‌త సీబీఐ విచార‌ణ చేసింది. అయిన‌ప్ప‌టికీ ఆమె అరెస్ట్ కు మాత్రం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ముందుకు రాక‌పోవ‌డాన్ని విప‌క్షాలు అనుమానిస్తున్నాయి.

భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రంలేదు అంటూ క‌విత‌కు తెలంగాణ సీఎం కేసీఆర్(KCR ED)

పలు సంద‌ర్భాల్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ (BJP-BRS) మ‌ధ్య ఉన్న సంబంధాన్ని చెబుతూ వ‌స్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కాళేశ్వ‌రం, మిష‌న్ కాక‌తీయ‌, భ‌గీర‌థ ప‌థ‌కాల్లో జ‌రిగిన అవినీతిపై కేంద్రం ద‌ర్యాప్తుకు ముందుకు రాలేదు. అంతేకాదు, మియాపూర్ భూ కుంభ‌కోణం, డ్ర‌గ్స్ కేసుల్లోనూ దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌లేదు. పైగా ఢిల్లీ కేంద్రంగా. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాల‌యం నిర్మాణానికి స్వ‌ల్ప ధ‌ర‌కు స్థ‌లాన్ని కేంద్రం కేటాయించింది. ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా లోక్ స‌భ‌లో ఎంపీలు లేని పార్టీకి ఢిల్లీ న‌డిబొడ్డున స్థ‌లాన్ని ఇవ్వడాన్ని రేవంత్ రెడ్డి ప‌లుమార్లు ప్ర‌స్తావించారు. అంతేకాదు, ఎనిమిదేళ్లుగా ఎప్పుడెప్పుడు పార్ల‌మెంట్ లోప‌ల‌, బ‌య‌ట బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అంట‌కాగిందీ గుర్తు చేస్తున్నారు. అదే బంధం ఆ రెండు పార్టీల మ‌ధ్య కొన‌సాగుతుంద‌ని ప్ర‌త్య‌ర్థుల అనుమానం. అందుకే, క‌విత అరెస్ట్ ను నాన్చుతున్నార‌ని విమర్శిస్తున్నారు.

Also Read : BRS Kavitha :ఆర్థిక పాపం పండింది!ED బేడీల వేళ నారీభేరీ!

ఇదోగో అరెస్ట్ అంటూ నాలుగు నెల‌లుగా బీజేపీ తెలంగాణ నేత‌లు చెబుతున్నారు. అంతేకాదు, ఆ మ‌ధ్య తెలంగాణ‌కు వ‌చ్చిన అమిత్ షా కూడా టీఆర్ఎస్ పెద్ద త‌ల‌కాయ‌ల అరెస్ట్ త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ఆ కామెంట్ల‌ను చేసి ఇప్ప‌టి ఆరు నెల‌లు దాటిపోతోంది. అయిన‌ప్ప‌టికీ ఎవ‌ర్నీ ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్ట్ చేయ‌లేదు. కేవలం కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేల మీద ఐడీ దాడులు జ‌రిగాయి. అంత‌కు మించి ఎలాంటి హ‌డావుడి లేదు. ఆ రెండు పార్టీ ల మ‌ధ్య వైరం ఉంద‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డానికి మాత్ర‌మే అలా ఐటీ దాడులు జ‌రిగాయ‌ని విప‌క్షాల అనుమానం. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీలు క్విడ్ ప్రో కో (KCR ED) ఏ విధంగా ఉందో ప్ర‌తి ఘ‌ట్టంలోనూ విప‌క్షాల విశ‌దీక‌రిస్తున్నాయి. ఇప్పుడు అస‌లు సిస‌లైన టైమ్ ఆ రెండు పార్టీల బంధానికి వ‌చ్చింది.

బీజేపీ, బీఆర్ఎస్  ఒక‌టేన‌ని చెప్పే వాళ్ల మాట‌ల‌ను

తెలంగాణ సీఎం కుమార్తె క‌విత ఢిల్లీకి వెళ్లారు. ఇటీవ‌ల సీబీఐ విచార‌ణ సంద‌ర్భంగా ప‌లు ఆధారాల‌ను క‌విత నుంచి సేక‌రించ‌డం జ‌రిగింది. మ‌రోసారి ఆమెను సీబీఐ పిలుస్తుంద‌ని అంద‌రూ భావించారు. ఆ లోపు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. లైగ‌ర్ సినిమాకు సంబంధించిన లావాదేవీల క్లూ లాగితే మ‌నీ ల్యాండ‌రింగ్ దోవ క‌దిలింద‌ని తెలుస్తోంది. క్యాసినో ప్ర‌వీణ్ నుంచి లైగ‌ర్ సినిమా వ‌ర‌కు మ‌నీ ల్యాండ‌రింగ్ వ్య‌వ‌హారం డ్ర‌గ్స్ మీదుగా న‌డిచింది. కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టిన చందంగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ మౌనం వ‌హించింది. ఇంకేముంది బీజేపీ, బీఆర్ఎస్ (BJP-BRS) ఒక‌టేన‌ని చెప్పే వాళ్ల మాట‌ల‌ను ప్ర‌జ‌లు విశ్వ‌సించారు. ఇప్పుడు క‌విత ఢిల్లీ లిక్క‌ర్ వ్య‌వ‌హారం వ‌చ్చింది. సాధారణంగా ఏదైనా అంశంపై లాబీయింగ్ కోసం కేసీఆర్ కు ఢిల్లీ పైయిట్ ఎక్క‌డం అలవాటు. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసిన‌ప్పుడు కూడా పార్ల‌మెంట్ కు వెళ్ల‌కుండా బ‌య‌ట లాబీయింగ్ న‌డిపారు.

Also Read : Kavitha Reaction: తెలంగాణ తల వంచదు.. లిక్కర్ స్కామ్ పై కవిత రియాక్షన్!

ఇప్పుడు కవిత ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారంలోనూ లాబీయింగ్ చేయ‌డానికి కేసీఆర్(KCR ED) ఢిల్లీ వెళ‌తార‌ని ప్ర‌త్య‌ర్థులు భావించారు. అనూహ్యంగా క‌విత ఢిల్లీ విమానం ఎక్కారు. తెల్ల‌వారితే, ఈడీ ఎదుట ఆమె హాజ‌రు కావాలి. అయిన‌ప్ప‌టికీ ముఖాముఖి కేసీఆర్ ను క‌ల‌వ‌కుండా కేవ‌లం ఫోన్ చేసిన ఫ్లైట్ ఎక్కారు. అంటే, లాబీయింగ్ అంతా ముగిసిన‌ట్టేనా? అందుకే, కేసీఆర్ ధైర్యంగా ఉన్నారా? ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రంలేద‌ని ధైర్యం చెబుతున్నారా? భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రంలేద‌ని ఫోన్లోనే బిడ్డ భుజం తుడున్నారంటే, కేసీఆర్ అంతా చ‌క్క‌దిద్దారని ప్ర‌త్య‌ర్థులు అనుమానిస్తున్నారు. తిమ్మిన‌బ‌మ్మిని చేయ‌డంలో కేసీఆర్ దిట్ట‌. ఆ విష‌యం ఢిల్లీ కాంగ్రెస్, బీజేపీ పెద్ద‌ల‌కు బాగా తెలుసు. జాతీయ స్థాయిలోని పార్టీల అధిప‌తుల‌కు ఆయ‌న రాజ‌కీయంపై అనుభ‌వం ఉంది. ఇప్పుడు క‌విత ఈడీ విచార‌ణ విష‌యంలో కేసీఆర్ చ‌క్రం ఎలా తిప్పుతారు? అనేది ఆస‌క్తిక‌రం.