Telangana: అసెంబ్లీకి రాకుండా కేసీఆర్‌ టీవీ9 కి వెళ్ళాడు: సీఎం రేవంత్

అసెంబ్లీకి రాకుండా కేసీఆర్‌ టీవీ9 కి వెళ్లిండు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ జన జాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ తీరుని ఎండగట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలకు దిగారు.

Published By: HashtagU Telugu Desk
Telangana

Telangana

Telangana: అసెంబ్లీకి రాకుండా కేసీఆర్‌ టీవీ9 కి వెళ్లిండు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ జన జాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ తీరుని ఎండగట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలకు దిగారు. ఎప్పుడైతే కేసీఆర్ కాంగ్రెస్, రేవంత్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారో అప్పటి నుంచి రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు అసెంబ్లీకి రావడం మానేసిండు అంటూ విమర్శించారు సీఎం. స్కూల్‌కి ఎగ్గొట్టినట్లే అసెంబ్లీ సమావేశాలను బంక్ చేయడంపై కేసీఆర్‌పై మండిపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీకి బదులు టీవీ9 స్టూడియోకి వెళ్ళి దాదాపు నాలుగు గంటల పాటు కూర్చున్నారని ఎద్దేవా చేశారు.

We’re now on WhatsAppClick to Join

కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చకు రావాలని కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ను చచ్చిన పాముగా అభివర్ణించాడు సీఎం రేవంత్. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ ని మందేసి గీశాడో, లేక మందు దిగాక గీశాడోగని ప్రాజెక్టు అయితే కూలిపోయిందని ఆరోపించారు. సీఎం. ఈ నేపథ్యంలో దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు.ఇక 2 లక్షల రైతు రుణమాఫీ ఆగస్టు 15 నాటికి పూర్తవుతుందని, తన రాజీనామా లేఖను సిద్ధంగా ఉంచాలని రేవంత్ రెడ్డి హరీష్‌రావును కోరారు. ఎన్నికల సభల్లో దేవుళ్లపై ప్రమాణం చేసి రైతులను తప్పుదోవ పట్టించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని హరీశ్‌రావు పదేపదే చేస్తున్న వ్యాఖ్యలపై రేవంత్‌ ఈ సవాల్‌ విసిరారు.

Also Read: Latest Report: మానసిక సమస్యలతో చిత్తవుతున్న ఢిల్లీ యువత.. ఎందుకో తెలుసా

  Last Updated: 25 Apr 2024, 12:11 AM IST