Site icon HashtagU Telugu

Harish Rao: కరోనా సమయంలో కేసీఆర్ రైతుబంధు ఆపలేదు: హరీశ్ రావు

Harish Rao

Harish Rao

Harish Rao: కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచారంలో భాగంగా బెజ్జంకిలో జరిగిన రోడ్ షోలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ వచ్చాక బోర్లలో నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు, తాగడానికి నీళ్లులేవు. పంటలు ఎండిపోతున్నాయి. కరెంటు ఉండడం లేదు. వద్దురో కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్నారు. రైతులను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. కేసీఆర్ హయాంలో వడ్లను గిట్టుబాటు ధరకు కొన్నాం’’ అని హరీశ్ రావు గుర్తు చేశారు.

‘‘500 బోనస్‌తో 2500కు కొంటామన్న రేవంత్… ఇప్పుడు రైతులు 1800లకే అమ్ముకుంటుంటే ఏం చేస్తున్నడు? కేసీఆర్ కరోనా సమయంలో సైతం రైతుబంధు ఆపలేదు. రేవంత్ రైతులకిచ్చిన రైతుబంధు 15వేలు, కౌలురైతులకు 15వేలు, వ్యవసాయ కూలీలకు 12వేలు ఇస్తామని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. పైగా 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిండు’’ అని హరీశ్ రావు మండిపడ్డారు.

‘‘అవ్వాతాతలకు 4 వేల పింఛన్ ఇస్తామని వాళ్లనూ మోసం చేసింది కాంగ్రెస్. మహిళలకు నెలకు 2500 ఇస్తామని రేవంత్ చెప్పిండు. వాళ్లకు 10 వేలు బాకీపడిండు. ఓట్ల కోసం కాంగ్రెస్ లీడర్లు వస్తే బుద్ధి చెప్పడానికి మహిళలు, చీపుర్లు, చాటలతో రెడీగా ఉన్నారు. ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నాడు. రెండు నెలల్లో లక్ష లగ్గాలు జరిగాయి. రేవంత్ లక్ష తులాల బంగారం బాకీ పడ్డడు. మన గుండెలమీద తన్నిన రేవంత్ రెడ్డిని ఎంపీ ఎన్నికల్లో గడ్డపారలై పోటుపొడవాలె. నాలుగు నెలలైనా హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌కు మళ్లీ ఓటేసి మోసపోదామా? అని హరీశ్ రావు ప్రశ్నించారు

Exit mobile version