Paddy Politics : వ‌రి ధాన్యంపై ఢిల్లీలో కేసీఆర్ చ‌క్రం

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని సీఎం కేసీఆర్ క‌లిసే అవ‌కాశం ఉంది. ఢిల్లీ వెళ్లిన ఆయ‌న అపాయిట్మెంట్ కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

  • Written By:
  • Updated On - November 22, 2021 / 05:22 PM IST

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని సీఎం కేసీఆర్ క‌లిసే అవ‌కాశం ఉంది. ఢిల్లీ వెళ్లిన ఆయ‌న అపాయిట్మెంట్ కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. తెలంగాణలో వరి సేకరణపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలపై కూడా సీఎం మాట్లాడవచ్చు. కేంద్రం నిర్ణయం ఆధారంగా వరి సాగుపై రైతులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.మోడీతో జ‌రిగే చర్చలను బట్టి యాసంగి పంటలపై కె చంద్రశేఖర్ రావు స్పష్టమైన ప్రకటన చేస్తారు. కృష్ణా జలాల పంపకం, కృష్ణా ట్రిబ్యునల్‌ ఏర్పాటు, గిరిజన రిజర్వేషన్‌, ఎస్సీ జనాభా గణన వంటి అంశాలపైనా ఇరువురి మ‌ధ్యా చర్చ జరిగే అవకాశం ఉంది. సీఎం వెంట మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో కలిసి న్యూఢిల్లీ వెళ్లారు.

Also Read : రాజ్య‌స‌భ‌కు క‌విత‌? ..మంత్రి ప‌ద‌వి అంద‌నిద్రాక్షే..!

ప్ర‌స్తుతం కేసీఆర్ స‌తీమ‌ణి ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ వ‌చ్చిన త‌రువాత ఊపితిత్తుల స‌మ‌స్య‌తో ఆమె బాధ ప‌డుతున్నారు. రెండు రోజులుగా కేటీఆర్‌, క‌విత ఎయిమ్స్ లోనే ఉంటూ త‌ల్లిని చూసుకుంటున్నారు. కేసీఆర్ ఢిల్లీ ఎయిమ్స్ కు వెళ్లి స‌తీమ‌ణి ఆరోగ్య ప‌రిస్థితిని స‌మీక్షిస్తారు. అలాగే, రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై మోడీతో పాటు సంబంధిత కేంద్ర మంత్రుల‌ను క‌లవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు.
ప్ర‌ధానంగా వ‌రి ధాన్యం కొనుగోలు అంశంపై మోడీ నుంచి క్లారిటీ తీసుకోవాల‌ని కేసీఆర్ భావిస్తున్నాడు. బాయిల్డ్ బియ్యం కొనుగోలు చేయ‌మ‌ని ఇప్ప‌టికే కేంద్రం స్ప‌ష్టం చేసింది. యాసంగి ఉత్ప‌త్తితో ఎంత భాగం కేంద్రం కొనుగోలు చేస్తుందో తెలియ‌దు. ఖరీఫ్ వ‌రి ధాన్యం ఇంకా కొనుగోలు చేయ‌డానికి మిగిలే ఉంది. వాటిని కొనుగోలు చేయడానికి స‌హ‌కారం కోరాల‌ని కేసీఆర్ అనుకుంటున్నారు. తెలంగాణ కేంద్రంగా వ‌రి ధాన్యం కొనుగోలు అంశంపై బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య వార్ జ‌రుగుతోంది. ప్ర‌ధాని మోడీని క‌లిసి దానికి ఫుల్ స్టాప్ పెట్టాల‌ని కేసీఆర్ భావిస్తున్నాడు.