KCR BRS : ఢిల్లీ – హైద‌రాబాద్ `కేసీఆర్` ష‌టిల్‌ స‌ర్వీస్

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూ హైద‌రాబాద్ ష‌టిల్ స‌ర్వీస్ ఫిక్స్ కానుంది.

  • Written By:
  • Updated On - December 17, 2022 / 02:49 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) ఢిల్లీ టూ హైద‌రాబాద్ ష‌టిల్ స‌ర్వీస్ ఫిక్స్ కానుంది. ప్ర‌తి నెలా తొలి వారం ఢిల్లీ బీఆర్ఎస్ (Delhi BRS) ఆఫీస్ నుంచి కార్య‌క‌లాపాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. క‌నీసం ప‌ది రోజుల పాటు ఢిల్లీ 20 రోజుల పాటు హైద‌రాబాద్(Hydrabad) కేంద్రంగా ప‌నిచేయాల‌ని ప్రాథ‌మికంగా కేసీఆర్(KCR) షెడ్యూల్ చేసుకున్నార‌ని తెలుస్తోంది. అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల హడావుడి నెల‌కొన్ని నేప‌థ్యంలో పొలిటిక‌ల్ ష‌టిల్ స‌ర్వీస్ కు కేసీఆర్ మొగ్గుచూపుతున్నార‌ని పార్టీ వ‌ర్గాల్లోకి వినికిడి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ (Delhi BRS) ను ఢిల్లీలో ప్రారంభించిన త‌రువాత నాలుగు రోజుల పాటు అక్క‌డే ఉన్న కేసీఆర్(KCR) శ‌నివారం హైద‌రాబాద్ చేరుకున్నారు. రాబోవు ఎన్నిక‌ల ప్ర‌చారం దిశ‌గా పూర్తి స్థాయి ప్ర‌ణాళిక‌ను ఖ‌రారు చేసే ప‌నిలో ఆయ‌న నిమ‌గ్నం అయ్యార‌ని తెలుస్తోంది.

సామాజిక‌వ‌ర్గాల వారీగా అంద‌ర్నీ ఆక‌ట్టుకోవాల‌ని కేసీఆర్ సిద్ధం అయ్యారు. ఇప్ప‌టికే ద‌ళిత బంధును అమ‌లు చేస్తోన్న ఆయ‌న రాబోవు రోజుల్లో బీసీ బంధు ప్ర‌క‌టించ‌డానికి క‌స‌ర‌త్తు చేస్తున్నారు. సామాజిక‌వ‌ర్గాల వారీగా ఏదో ఒక ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించ‌డం ద్వారా అధికారం జారిపోకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ప్ర‌ధానంగా ఉద్యోగుల‌ను ఫ్రెండ్లీ ప్ర‌భుత్వంగా తొలి నుంచి కేసీఆర్ స‌ర్కార్ ను న‌డుపుతున్నారు. అనూహ్యంగా ఫిట్మెంట్ ను ఇవ్వ‌డంతో పాటు జీతాల‌ను టంఛ‌న్ గా పెంచుకుంటూ వ‌స్తున్నారు రాబోవు రోజుల్లో సీపీఎస్ కు బ‌దులుగా ఓపీఎస్ ను తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని వినికిడి. సీపీఎస్ ర‌ద్దు కోసం ఏపీ ప్ర‌భుత్వం ఉద్యోగులు కూడా ప‌ట్టుబ‌డుతున్నారు. దానికి బ‌దులుగా ఓపీఎస్ ను కేసీఆర్ ప్ర‌క‌టిస్తే అదే పంథాను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా అనుస‌రించ‌డానికి ఛాన్స్ ఉంది.

ఢిల్లీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో

సీఎం కేసీఆర్ ను క‌లుసుకోవ‌డానికి మంత్రుల‌తో స‌హా ఎవ‌రికీ అవ‌కాశం ఉండ‌ద‌ని తొలి నుంచి ఉన్న ప్ర‌చారం. దానికి చెక్ పెట్టేలా ఢిల్లీ పార్టీ ఆఫీస్ లో అంద‌ర్నీ క‌లుసుకోవ‌డానికి కేసీఆర్ డోర్స్ తెరిచారు. పార్టీ ఎంపీలు, రైతు నేతలతో సుదీర్ఘంగా ఆయ‌న స‌మావేశం అయ్యారు. అలాగే, ఆయ‌న‌తో ఫోటో దిగ‌డానికి బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీ కేంద్రంగా పోటీ ప‌డ్డారు. అధినేత ప‌క్క‌న ఫోటో కోసం ఢిల్లీలో క్యూ క‌ట్టారు. ఇలాంటి ప‌రిణామాన్ని గ‌మ‌నించిన కేసీఆర్ మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత ఢిల్లీ-హైద‌రాబాద్ ష‌టిల్ స‌ర్వీస్ ను నిర్థారిస్తార‌ని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు మ‌ధ్య‌ ఐదు నెలల గ‌డువు మాత్ర‌మే ఉంది. ఆ రెండు ఎన్నికలపై దృష్టి సారించేందుకు హైదరాబాద్-ఢిల్లీ మధ్య షటిల్ చేయాలని సీఎం ప్లాన్ చేస్తున్నారని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ప‌లు రాష్ట్రాల్లోని ప‌రిస్థితుల‌ను కేసీఆర్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నారు. ఆ క్ర‌మంలో హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపు వెనుక ఓపీఎస్ వాగ్ధానం ఉంద‌ని గ్ర‌హించారు. అందుకే ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న సీపీఎస్ విధానం బ‌దులుగా ఓపీఎస్ ను తిరిగి తీసుకువస్తామన్న ఢిల్లీ కేంద్రంగా ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు హామీ ఇచ్చారు. నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌ఎంఓపీఎస్) ఓపీఎస్ కోసం ఆందోళన చేస్తున్న అన్ని రాష్ట్రాల ఉద్యోగుల సంఘాల నేతలు న్యూఢిల్లీలో సీఎంను కలిసి మద్దతు కోరారు. ఆ బృందంలో ఎన్‌ఎంఓపీఎస్‌ సెక్రటరీ జనరల్‌ జి. స్థితప్రజ్ఞ, తెలంగాణ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కె. శ్రీకాంత్‌, కోశాధికారి నరేష్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు. తెలంగాణలో 2004 తర్వాత రిక్రూట్ అయిన సుమారు 1.7 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్ పరిధిలో ఉన్నారని, ఓపీఎస్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు సీఎంకు సూచించారు. సీపీఎస్‌ వల్ల పెన్షనర్లకు సామాజిక భద్రత కరువై దేశవ్యాప్తంగా దాదాపు 84 లక్షల మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, సిక్కిం క్రాంతికారీ మోర్చా పాలిత రాష్ట్రాల్లో సీపీఎస్‌ రద్దు చేయాలని నిర్ణయించాయని సీఎంకు వివరించారు.

ఓపీఎస్‌ని పునరుద్ధరించేందుకు

అన్ని రాష్ట్రాల్లో సీపీఎస్‌ను పరిశీలించి, ఓపీఎస్‌ని పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలను పరిశీలించిన తర్వాత బీఆర్‌ఎస్ జాతీయ విధానాన్ని త్వరలో ప్రకటిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మొదటిసారిగా దేశ రాజధానిలోని పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన రావు, పార్టీ ఎంపీలు మరియు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు మరియు ఉద్యోగుల సంఘాల నాయకులతో సమావేశమై పార్టీని ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలపై చర్చించారు. రాష్ట్రాలు. సమావేశం అనంతరం సీఎం శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్నారు. రాబోవు రోజుల్లో ష‌టిల్ స‌ర్వీస్ చేయాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు. జాతీయ విధానాల్లో ఓపీఎస్ ను చేర్చ‌డానికి కేసీఆర్ సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది.

Also Read : KCR BRS: కేసీఆర్ స్కెచ్.. ఆ ముగ్గురికి ‘బీఆర్ఎస్’ కీలక బాధ్యతలు!