KCR Constitution : కేసీఆర్ ‘రాజ్యాంగ’ దుమారం

బడ్జెట్ పై కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ బీజేపీ వ్యతిరేకులందరూ కేసీఆర్ ని మెచ్చుకునేలా చేసింది.

  • Written By:
  • Publish Date - February 3, 2022 / 10:32 AM IST

బడ్జెట్ పై కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ బీజేపీ వ్యతిరేకులందరూ కేసీఆర్ ని మెచ్చుకునేలా చేసింది. బడ్జెట్ పై ఇంత సీరియస్ గా యే సీఎం రియాక్ట్ అవ్వలేదని కేసీఆర్ వ్యతిరేకులు కూడా ఆయన్ని అభినందించారు. మోదీని, బీజేపీని ఈ రేంజ్ లో దుమ్ముదులపడం కేసీఆర్ కి మాత్రమే సాధ్యమని, తమ సీఎంలు కూడా అలా మాట్లాడితే చూడాలని ఉందని చాలా రాష్ట్రాల ప్రజలు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. అయితే ఆ ప్రెస్ మీట్ లో రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రాజ్యాంగం మారాల్సిన అవసరముందని, అవసరమయితే కొత్త రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేయాలని కేసీఆర్ అనడం పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

నిజానికి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఒక మిక్స్డ్ టాక్ వస్తోంది. కానీ బీజేపీ మాత్రం కేసీఆర్ వ్యాఖ్యలని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది. కేసీఆర్ రాజ్యాంగాన్ని, అది రాసిన అంబేద్కర్ ని అవమానపరిచారని పలు నిరసన కార్యక్రామాలకి పిలుపునిచ్చింది. కేసీఆర్ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో బీజేపీ భీం దీక్ష కి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద బీజేపీ ఎంపీలు అరవింద్, బాబురావు తో సహా మరికొంతమంది ఎంపీలతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు.కేసీఆర్ వ్యాఖ్యల్లో తప్పేం లేదని ఇప్పటివరకు రాజ్యాంగాన్ని చాలాసార్లు సవరించామని, రాష్ట్రాల ప్రయోజనాలకు ఇబ్బందిగా ఉన్న పలు ఆర్టికల్స్ ని సవరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే జీఎస్టీ, రైతు చట్టాలు, 370 లాంటిరాష్ట్రాల హక్కులను కాలరాసే చట్టాలకు మద్దతిచ్చిన కేసీఆర్ ఇప్పుడు అవే కారణాలని చూపిస్తూ రాజ్యాంగాన్ని మార్చాలనడంపై విమర్శలు వస్తున్నాయి.

రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తోన్న బీజేపీపై కూడా విమర్శలు వస్తున్నాయి. గోవాలో జరిగిన హిందూ అతివాదుల సమావేశంలో భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని రాజ్యాంగంగా పెట్టాలని తీర్మాణం చేశారని, దానికి ముఖ్యమంత్రి హోదాలో బీజేపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ హాజరయ్యాడని ఆయన విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాలని బండి సంజయ్ ని పలువురు ప్రశ్నిస్తున్నారు.బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ భారత రాజ్యాంగాన్ని నేటికీ గుర్తించదని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నది అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమేనని నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. ఉమ్మడి లిస్ట్ ని అడ్డం పెట్టుకుని బీజేపీ చేయని అవమానం లేదని, స్టేట్ లిస్ట్ లో ఉన్న ఫార్మా రంగాన్ని ఓవర్ రూల్ చేసి రైతు చట్టాలు చేసిందని, రాజ్యాంగం కాశ్మీర్ ప్రజలకు హామీ పడిన ఆర్టికల్ 370 రద్దు చేసిందని, రాజ్యాంగ వ్యతిరేక సీఏఏ ఎన్ఆర్సీ చట్టాలను తెచ్చిందని ఇవన్నీ రాజ్యాంగ అపహాస్యాలు, అవమానాలు
కాదా అని బీజేపీని ప్రశ్నిస్తున్నారు.