KCR Contest : 3చోట్ల కేసీఆర్ స‌ర్వేలు, గ‌జ్వేల్ డౌట్

తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR Contest)  ఈసారి ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారు? గ‌జ్వేల్ నుంచి మూడోసారి పోటీ చేసే అవ‌కాశం ఉందా?

  • Written By:
  • Publish Date - July 28, 2023 / 04:37 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR Contest)  ఈసారి ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారు? గ‌జ్వేల్ నుంచి మూడోసారి పోటీ చేసే అవ‌కాశం ఉందా? అంటే లేదంటున్నారు కొంద‌రు బీఆర్ఎస్ వ‌ర్గీయులు. సర్వేల‌ను బేస్ చేసుకుని మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. గ‌జ్వేల్ నుంచి ఈసారి పోటీ చేస్తే సానుకూల ఫ‌లితాలు ఉండే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంద‌ని స‌ర్వేల సారాంశం. అందుకే, కామారెడ్డి, మేడ్చ‌ల్, పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

సీఎం కేసీఆర్ (KCR Contest)  ఈసారి ఎక్క‌డ నుంచి పోటీ(KCR Contest) 

ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత కేసీఆర్ గ‌జ్వేల్ నుంచి రెండుసార్లు (KCR Contest)  గెలుపొందారు. ఆయ‌న ఆశించిన విధంగా అక్క‌డి ప్ర‌జ‌ల‌కు సేవ‌ల చేయ‌లేద‌ని ప‌బ్లిక్ లోని అసంతృప్తి. సాధార‌ణంగా పోటీ చేసిన చోట తిరిగి పోటీ చేయ‌డానికి కేసీఆర్ ఇష్ట‌ప‌డ‌రు. అయితే, రెండుసార్లు గజ్వేల్ నుంచి పోటీ చేసిన ఆయ‌న మూడోసారి పోటీ చేయ‌డానికి స‌హజంగా అయిష్టంగా ఉన్నార‌ని తెలుస్తోంది. దానితోడు ప‌బ్లిక్ నుంచి సానుకూల‌త కూడా పెద్ద‌గా లేద‌ని స‌ర్వేల సారాంశం. పైగా పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత గ‌జ్వేల్ మీద ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారట. ఈసారి అక్క‌డ నుంచి ఆయ‌న పోటీ చేస్తేఓడించ‌డానికి వ్యూహాల‌ను ర‌చించార‌ని తెలుస్తోంది.

స‌ర్వేల ఆధారంగా మేడ్చ‌ల్ అనుకూలంగా కేసీఆర్ కు 

స‌ర్వేల ఆధారంగా మేడ్చ‌ల్ అనుకూలంగా కేసీఆర్ కు  (KCR Contest) మొద‌టి ఆప్ష‌న్ కింద క‌నిపిస్తుంద‌ని పార్టీ వ‌ర్గాల్లోని వినికిడి. అక్క‌డ నుంచి ప్ర‌స్తుతం మంత్రి మ‌ల్లారెడ్డి ఉన్నారు. రెండుసార్లు అక్క‌డి నుంచి ఆయ‌న గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీ నుంచి విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న‌ప్ప‌టికీ గ్రాఫ్ అనుకూలంగా లేద‌ని తెలుస్తోంది. స‌ర్వేలు కూడా ఆయ‌నకు ప్ర‌తికూలంగా ఉన్నాయ‌ని స‌మాచారం. అలాగ‌ని, ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టే ధైర్యం అధిష్టానం చేయ‌డానికి సాహ‌సం చేయ‌డంలేదు. మ‌ధ్యేమార్గంగా కేసీఆర్ అక్క‌డ నుంచి రంగంలోకి దిగే అవ‌కాశం ఉంద‌ని టాక్‌.

Also Read : CM KCR: బీసీ విద్యార్థులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. 10వేల మందికి ఉచితంగా ఫీజు!

నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గంపా గోవ‌ర్థ‌న్ వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తున్నారు. ఆ జిల్లా నుంచి ఈసారి ఎంపీగా మ‌రోసారి పోటీ చేయ‌డానికి క‌విత సిద్ద‌మ‌వుతున్నారు. ఆ క్ర‌మంలో కుమార్తె పోటీ చేసిన ప‌రిధిలోనే కేసీఆర్ కూడా పోటీ చేయ‌డాన్ని ప‌బ్లిక్ సానుక‌లంగా తీసుకోర‌ని ఒక అభిప్రాయం. అందుకే, ఆయ‌న పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డానికి అనుకూలంగా ఉన్న మ‌రో సెంట‌ర్. అక్క‌డ నుంచి మ‌నోహ‌ర్ రెడ్డి వ‌రుస‌గా రెండుసార్లు గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న మీద స‌ర్వేలు సానుకూలంగా (KCR Contest)  లేవ‌ని తెలుస్తోంది. అందుకే, కేసీఆర్ అక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు వినికిడి.

Also Read : BRS MLAs: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఈసీకి ఫిర్యాదు చేసిన షర్మిల

రాజ‌కీయంగా ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ బ‌ల‌హీనంగా ఉంది. ఆ విష‌యం అధిష్టానంకు బాగా తెలుసు. అందుకే, ద‌క్షిణ తెలంగాణ మీద ప్ర‌త్యేకంగా కేసీఆర్ దృష్టి పెట్టారు. ఖమ్మం, న‌ల్లొండ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల నుంచి కేసీఆర్ పోటీ చేస్తే పార్టీకి సానుకూల వాతావ‌ర‌ణం వ‌స్తుంద‌ని అంత‌ర్గ‌త చ‌ర్చ‌. కానీ, ఎక్క‌డా సానుకూలంగా సర్వేలు లేవ‌ని తెలుస్తోంది.ఇలాంటి ప‌రిస్థితుల్లో సిట్టింగ్ ల‌ను కాద‌ని కేసీఆర్ వాళ్ల స్థానాల్లో  (KCR Contest) పోటీ చేస్తారా? తిరిగి గ‌జ్వేల్ నుంచి రంగంలోకి దిగుతారా? ప్ర‌త్య‌ర్థి. పార్టీల‌కు స‌వాల్ విస‌ర‌డానికి ఖ‌మ్మం జిల్లాను ఎంచుకుంటారా? అనేది చూడాలి.