Site icon HashtagU Telugu

KCR Confirmed: తేల్చేసిన కేసీఆర్.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్స్!

BRS

Kcr's Four Pronged Strategy, Key Steps On 9,10,11

తెలంగాణలో (Telangana) ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) పార్టీ ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్ చెప్పారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో దాదాపుగా ఎన్నికలకు వార్నింగ్ బెల్ కొట్టేశారు సీఎం కేసీఆర్. ఎన్నికల ఏడాదిలో ఉన్నామని, జనంలోకి వెళ్లాలని, ప్రతి ఒక్కరినీ పలకరించాలని, ప్రభుత్వ కార్యక్రమాలు వివరించాలని, పాదయాత్రలు చేయాలని ఎమ్మల్యేలు, నేతలకు వివరించారు. అదే సందర్భంలో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేల (MLA’s)కు శుభవార్త చెప్పారు. 99శాతం సిట్టింగ్ లకే ఈసారి కూడా ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తామన్నారు. దీంతో ఒకరకంగా ఎమ్మెల్యేలంతా ఫుల్ ఖుషీ అయిపోయారు.

సిట్టింగ్ ల స్థానాల్లో కొత్తవారిని నిలబెట్టినా, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి గురించి వివరించి ఓట్లు అడిగే పరిస్థితి ఉంది. కానీ కేసీఆర్ అలాంటి ప్రయోగాలు చేయదలచుకోలేదు. అసంతృప్తి లేని దగ్గర సిట్టింగ్ లకే మరో అవకాశం ఇస్తామంటున్నారు (CM KCR). “గత ఎన్నికల్లో కొందరిని తీరు మార్చుకోవాలని పదే పదే చెప్పి చూశా. వాళ్లు పద్ధతి మార్చుకోలేదు కాబట్టే వారిని మార్చాల్సి వచ్చింది. ఈసారి సిట్టింగులెవరినీ మార్చాలనే ఉద్దేశం నాకైతే లేదు. ఎవరైనా తమంతట తాము తప్పులు చేస్తే తప్ప.. 99 శాతం సిట్టింగులందరికీ తిరిగి సీట్లు వస్తాయి. నేనే గెలిపించుకుంటా. అయితే తప్పు చేసిన వారికి మాత్రం టికెట్లు దక్కవు. నేను అసలే మొండివాడిని. మీరు కోరి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పారదర్శకంగా వ్యవహరించండి.”అంటూ ఎమ్మెల్యేలకు ఉద్భోదించారు (CM KCR) సీఎం కేసీఆర్.

Also Read: Das Ka Dhamki: విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ 2.0 ట్రైలర్ మార్చి 12న గ్రాండ్ లాంచ్