Telangana: కేసీఆర్ తోనే తెలంగాణ సాధ్యమా…? మరి సోనియా ఎవరు…??

ఏదైనా అద్భుతం జరిగిందంటే..అది మా వాళ్లే జరిగిందంటూ...ప్రచారం చేసుకోవడం ఎంత వరకు సబబు.

  • Written By:
  • Publish Date - February 19, 2022 / 05:33 PM IST

ఏదైనా అద్భుతం జరిగిందంటే..అది మా వాళ్లే జరిగిందంటూ…ప్రచారం చేసుకోవడం ఎంత వరకు సబబు. అందులో ముఖ్యంగా రాజకీయ అద్బుతం అయితే…అదంతా మా వల్లే జరిగిందంటూ చెప్పుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు సరిగ్గా తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను చూస్తుంటే…అలాంటి పరిస్థితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర సాధనా అంతా కూడా కేవలం టీఆరెస్ అధినేత కేసీఆర్ వల్లే జరిగిందంటూ చెబుతున్న మాటల్లో అర్దం లేదనే భావన కనిపిస్తోంది. తెలంగాణను సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారనడంలో సందేహం లేదు. కానీ ఆ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్ ఖాతాలో వేయడం అత్యాశే అవుతుంది కదా..!!

తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరితోనూ ఏర్పడలేదు. కోట్లాది మంది ప్రజలు రోడ్లకు మీదకు వచ్చారు. భావోద్వేగంతో రగిలిపోయారు. వేలాది మంది ప్రాణా త్యాగం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహారించకపోతే…తెలంగాణ రాష్ట్ర కల…కలగానే ఉండేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆ విషయానికి వస్తే….కేసీఆర్ చేసిన ఉద్యమాల కంటే…తెలంగాణ రాష్ట్రం ఏర్పాడాలని ఆత్మబలిదానలు చేసుకున్నవారితోనే సాధ్యమవుతుందని యువత భావించింది. తమ ప్రాణాలను సైతం అర్పించుకోవడంతో…రాష్ట్ర ఏర్పాటు విషయాన్ని సీరియస్ తీసుకున్నారు.

ఈ కీలక విషయాలన్నింటిని పక్కకు నెట్టి…తెలంగాణ రాష్ట్ర సాధన అంతా కూడా కేసీఆర్ తోనే సాధ్యమైంది…కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదన్నట్లుగా టీఆరెస్ నేతలు చేస్తున్న ప్రచారంలో ఎంత వరకు వాస్తవం ఉందన్నది గుర్తుతెచ్చుకోవాలి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సోనియా గాంధీ చేసిన సహాయాన్ని మర్చిపోలేం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ ఎన్ని ప్రయత్నాలు చేసిందే అందరికీ తెలిసిందే…

పార్లమెంట్ తలుపులు మూసీ…ప్రత్యక్షప్రసారాన్ని నిలిపివేసి మరీ తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని ఆమోదించిన విషయంలో ఇప్పటికీ సోనియా గాంధీ ఎన్నో ప్రశ్నలు ఎదుర్కుంటూనే ఉన్నారు. ఇప్పటికీ ఆ అంశం సోనియాను వెంటాడుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అంతటి కమిట్ మెంట్ ను ప్రదర్శించారు సోనియా. అందుకే తెలంగాణ కల సాధ్యమైంది. ఆ స్థానంలో సోనియా కాకుండా ఇంకెవరున్నా…తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదు.

కానీ మా వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని…క్రెడిట్ అంతా కూడా కేసీఆర్ కిందే చెప్పడం వాస్తవాన్ని వక్రీకరించడమే అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఏర్పాటు కేసీఆర్ పుణ్యమే అంటూ కేటీఆర్ అండ్ కోలు ప్రచారం చేయడం మానుకుంటే మంచిది. గతానికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు. క్రెడిట్ ఎవ్వరికి ఇవ్వాలన్న విషయంపై చర్చలు జరిగటం ఖాయం. అదే జరిగితే…కేసీఆర్ కు దక్కాల్సిన క్రెడిట్ ఢమాల్ అనడం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.