మరోసారి తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైనాతె కాంగ్రెస్ – బిఆర్ఎస్ పార్టీల మధ్య వార్ నడిచిందో..ఇప్పుడు కృష్ణ జలాలు, మేడిగడ్డ బ్యారేంజ్ కుంగడం వంటి అంశాలు ఇరు పార్టీల మధ్య వాడి వేడి చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటీకే రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) హాజరు కాలేదు. మొదటిసారి సమావేశాలు జరిగినప్పుడు కేసీఆర్ ఆరోగ్యం బాగాలేక రాలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న సమావేశాలకైనా వస్తారని అంత భావించారు కానీ రావడం లేదు. ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda Barrage) పరిశీలనకు రావాలని సీఎం రేవంత్ తో పాటు పలువురు మంత్రులు సూచించప్పటికీ కేసీఆర్ కాదు కదా..కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెళ్లడం లేదు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను KRMBకి అప్పగిస్తుందంటూ నిరసిస్తూ BRS నల్గొండలో బహిరంగ సభ (Chalo Nalgonda Meeting) ఏర్పాటు చేస్తుంది. దీనికి మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకాబోతున్నారు. దీంతో ఈ సభలో కేసీఆర్..కాంగ్రెస్ ప్రభుత్వం ఫై ఎలాంటి విమర్శలు చేస్తారో అని ఇరు పార్టీలనేతలు , శ్రేణులు ఎదురుచూస్తున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ నినాదంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సభలో పాల్గొనబోతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి సభ కావడంతో భారీ జన సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడి నుంచే కేసీయార్ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగ సభకు ఉమ్మడి నల్గొండతో పాటు కృష్ణా పరివాహకంలోని మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పెద్దఎత్తున రైతులు, ప్రజల్ని తరలించాలని బిఆర్ఎస్ నిర్ణయించింది. ఈ సభకు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు భారీ కాన్వాయ్‌తో నల్గొండకు రానున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సాయంత్రం హెలీకాప్టర్‌లో వచ్చి సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు. గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి కేఆర్ఎంబీ(KRMB) చేతికి ప్రాజెక్టులు ఇవ్వకుండా మా ప్రభుత్వం కాపాడుకుంది. దురదృష్టవశాత్తు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అనుభవలేమి, అవగాహనా రాహిత్యం, అంతర్గత ఒప్పందాలు లేదా ఇతర విషయాల వల్ల ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పింది. మళ్లీ మన ప్రాజెక్ట్‌లు సాధించుకోవాలని, కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా తేల్చాలని ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం.” అని మాజీ మంత్రి జగదీశ్ అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ సభకు పోటీగా అధికార కాంగ్రెస్ పార్టీ నల్గొండలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. మొత్తం మీద ఈ సభ ఫై , అటు మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన ఫై ఎవరు ఎలా స్పందిస్తారో అనే ఆసక్తి నెలకొంది.
Read Also : CM Jagan : నేడు ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలు.. హాజరుకానున్న సీఎం