KCR cap getup : కేసీఆర్ టోపీ మ‌ర్మం! బ‌హిరంగ స‌భ‌ల్లో న్యూ గెట‌ప్!!

కేసీఆర్ గెట‌ప్ మారింది. టోపీ (KCR cap getup)లేకుండాక‌నిపించ‌డంలేదు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన త‌రువాత టోపీల్లో క‌నిపిస్తున్నారు.

  • Written By:
  • Updated On - June 17, 2023 / 02:13 PM IST

కేసీఆర్ గెట‌ప్ మారింది. టోపీ (KCR cap getup) లేకుండా ఆయ‌న క‌నిపించ‌డంలేదు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన త‌రువాత టోపీ పెట్టుకుని మాత్ర‌మే స‌భ‌ల్లో క‌నిపిస్తున్నారు. దాని వెనుక ఏదో ర‌హ‌స్యం ఉంద‌ని పార్టీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. సెంటిమెంట్స్, మూఢ‌న‌మ్మ‌కాల‌కు ప్రాధాన్యం ఇచ్చే కేసీఆర్ టోపీ సీక్రెట్స్ ఏమిటి? అనేది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

కేసీఆర్ గెట‌ప్ టోపీ (KCR cap getup)

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఆయ‌న డ్ర‌స్ కోడ్(KCR cap getup) ఒక‌లా ఉండేది. ఎక్క‌డ‌కు వెళ్లిన‌ప్ప‌టికీ చేతికి కంక‌ణం క‌నిపించేది. ఒక వేళ లేక‌పోతే, ఎవ‌రో ఒక‌రు చేతికి కంక‌ణం కంటే వాళ్లు. దాన్ని పోరాటానికి చిహ్నంగా భావించే వాళ్లు. జై తెలంగాణ నినాదాల‌తో కేసీఆర్ పిడికిలి బిగించ‌డం చూశాం. అలా, కొన్నేళ్ల పాటు ఉద్య‌మాన్ని న‌డిపారు. క‌మ్యూనిస్ట్ సిద్ధాత‌మే త‌న‌ద‌ని చెప్పారు. న‌క్స‌లైట్ల సిద్ధాంతం టీఆర్ఎస్ సిద్ధాంతం అంటూ తొలి రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని ప‌ట్టాలు ఎక్కించారు. ఆ త‌రువాత ఫ‌క్తు రాజ‌కీయ పార్టీగా మారింద‌ని 2014 ఎన్నిక‌ల్లోనే ఆయ‌న ప్ర‌క‌టించారు.

కేసీఆర్   వైట్ అండ్ వైట్ ప్యాంట్ ష‌ర్ట్ డ్ర‌స్ కోడ్

ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్ప‌డిన త‌రువాత బిడికిలి కాస్తా విక్ట‌రీ సింబ‌ల్ కు మారింది. ప్ర‌తి వేదిక‌పైనా విక్ట‌రీ సింబ‌ల్ చూపిస్తూ రాజ‌కీయాన్ని న‌డిపారు. రెండుసార్లు సీఎం అయ్యారు కేసీఆర్. ముచ్చ‌ట‌గా మూడోసారి సీఎం కావ‌డానికి ప‌లు ర‌కాలు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. రాష్ట్రాన్ని సాధించ‌డం వ‌ర‌కు ప‌రిమితం చేసిన టీఆర్ఎస్ పార్టీని జాతీయం చేశారు. ప్ర‌స్తుతం జాతీయ వాదాన్ని వినిపిస్తున్నారు. అందుకు త‌గిన విధంగా గెట‌ప్ (KCR cap getup) మార్చేశారు.

Also Read : KCR Survey: కేసీఆర్ ఫస్ట్ లిస్ట్ రెడీ, సిట్టింగ్స్ లో టెన్సన్!

తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ నేత‌ల డ్ర‌స్ కోడ్ ను గ‌మ‌నిస్తే, చంద్ర‌బాబు డ్ర‌స్ కోడ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. విదేశాల‌కు వెళ్లిన‌ప్ప‌టికీ అదే డ్ర‌స్, అదే హెయిర్ స్టైల్ తో క‌నిపిస్తారు. అలాగే, కేసీఆర్ కూడా వైట్ అండ్ వైట్ ప్యాంట్ ష‌ర్ట్ డ్ర‌స్ కోడ్ ను చూశాం. రాజ‌కీయ నాయ‌కులు చాలా మంది వైట్ అండ్ వైట్ డ్ర‌స్ ఓడ్ ను ఫాలో అవుతున్నారు. ఇక న‌రేంద్ర మోడీ డ్ర‌స్ కోడ్ మోడ‌ల్ ఒకేలా ఉన్న‌ప్ప‌టికీ ప‌లు ర‌కాల డిజైన్ల‌ను వాడుతుంటారు. కుర్తా, ఫైజ‌మాను ఆయ‌న డ్ర‌స్ కోడ్ గా ఉంది. కొన్ని సంద‌ర్బాల్లో మాత్రం సూట్ వేసుకుంటారు. తెలంగాణ సీఎం కూడా సూట్ వేసుకోడాన్ని చూశాం. పంచెక‌ట్టుతో స్వ‌ర్గీయ రాజ‌శేఖ‌ర్ రెడ్డి క‌నిపించే వారు. చాలా అరుదుగా ఆయ‌న డ్ర‌స్ కోడ్ మార్చుతారు. ఇక మాజీ సీఎం రోశ‌య్య కూడా పంచె, లాల్చీ , దోవతి వేసుకుని నిండుగా క‌నిపిస్తారు. మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు తెల్ల లుంగీ, ష‌ర్ట్ డ్ర‌స్ కోడ్ తో కనిపిస్తారు.

డ్ర‌స్ కోడ్ లో మార్పు లేక‌పోయిన‌ప్ప‌టికీ టోపీ మాత్రం మ‌స్ట్

రొటీన్ డ్ర‌స్ కోడ్ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఉంటుంది. ఆదే డ్ర‌స్ కోడ్ తో గ‌త కొంత కాలంగా క‌నిపిస్తున్నారు. అరుదైన సంద‌ర్భాల్లో మిన‌హా ఈ డ్ర‌స్ కోడ్ ల‌కు భిన్నంగా ఈ నాయ‌కులు క‌నిపించ‌రు. ఇక కేసీఆర్ విష‌యానికి వ‌స్తే, ఆయ‌న వైట్ అండ్ వైట్ డ్ర‌స్ కోడ్ లో ఉంటారు. కానీ, ఇటీవ‌ల గెట‌ప్ మార్చారు. డ్ర‌స్ కోడ్ లో మార్పు లేక‌పోయిన‌ప్ప‌టికీ టోపీ మాత్రం మ‌స్ట్ గా ఉంటుంది. అంతేకాదు, ఆ టోపీకి గ్రీన్ క‌ల‌ర్ రిబ్బ‌న్ మాదిరిగా ఒక‌టి చుట్టి ఉంటుంది. బ‌హిరంగ స‌భ‌ల్లో ఖ‌చ్చితంగా ఆ టోపీతోనే కేసీఆర్ క‌నిపిస్తున్నారు. ఏ రాష్ట్రానికి వెళ్లిన‌ప్ప‌టికీ స‌భ‌ల్లో టోపీ(KCR cap getup) పెడుతున్నారు. ఆప్ కా బార్ కిసాన్ స‌ర్కార్ అంటూ నినాదాన్ని అందుకున్న ఆయ‌న టోపీ పెట్ట‌డం వెనుక ఏదో సీక్రెట్ ఉంటుంది. దాన్ని శోధించ‌డంపై పార్టీ క్యాడ‌ర్ ఉంది. ఏదో ఒక సంద‌ర్భంలో మీడియా స‌మావేశంలో చిలిపిగా చెప్ప‌క‌పోతారా? అంటూ ఎదురుచూస్తున్నారు.

Also Read : BRS plan : జ‌గ‌న్ ఫార్ములాతో ఎన్నిక‌ల‌కు కేసీఆర్ సిద్ధం! వ‌చ్చే 6నెల‌లు న‌గ‌దు బ‌దిలీ!!