తెలంగాణ ఎన్నికల ప్రచారం (Telangana Election Campaign)ఊపందుకుంది. అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (Congress) పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఓ పక్క , టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ (Revanth Reddy) మరో పక్క ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. అందరికంటే ముందే తమ అభ్యర్థులను ప్రకటించిన బిఆర్ఎస్..తమ మేనిఫెస్టో (BRS Manifesto 2023) ను మాత్రం కాంగ్రెస్ హామీల తర్వాత ప్రకటించి విమర్శలు ఎదురుకుంటుంది.
బిఆర్ఎస్ మేనిఫెస్టో ..కాంగ్రెస్ హామీలను (Congress 6 Guarantee Schemes) కాపీ కొట్టారంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. బిఆర్ఎస్ మేనిఫెస్టో ఏ రేంజ్ లో ఉంటుందో..ఎలాంటి హామీలు కురిపిస్తారో అని రాష్ట్ర ప్రజలతో పాటు ఇతర పార్టీలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసాయి. అలాగే కొద్ది రోజులుగా ఈ మేనిఫెస్టోపై కేటీఆర్, హరీష్ రావు అంచనాల పెంచుతూ వచ్చారు. ప్రతిపక్షాలకు కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యే మేనిఫెస్టో ప్రకటిస్తారని హరీష్ రావు చెపుతూ వచ్చారు. అందుకే కేసీఆర్ ఎలాంటి పథకాలు ప్రకటిస్తారోనన్న ఆసక్తి ప్రజల్లో ఏర్పడింది. రైతులకు పెన్షన్ సహా అనేక కొత్త కొత్త పథకాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోను చూసిన వారికి కాంగ్రెస్ మేనిఫెస్టోకు కౌంటర్ ఇచ్చినట్లుగా ఉంది తప్ప.. కొత్త విషయాలేం కనిపించలేదన్న టాక్ నడుస్తుంది. బిఆర్ఎస్ మేనిఫెస్టో లా లేదని కాంగ్రెస్ మేనిఫెస్టో నే కేసీఆర్ ప్రచారం చేస్తున్నట్లు ఉందని అంత మాట్లాడుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆసరా పింఛన్లు రూ.5 వేలకు పెంపు, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంపు, ‘సౌభాగ్య లక్ష్మి’ పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెలా రూ.3 వేల భృతి. పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్, రైతు బంధు మొత్తాన్ని రూ.16 వేలకు దశల వారీగా పెంపు. ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలు పెంపు. వంటి హామీలన్నీ కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఉన్న వాటికి కౌంటర్ ఇచ్చినట్లుగానే ఉన్నాయి తప్ప గొప్పగా ఏమిలేదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అవి ప్రకటించాయి కాబట్టి..వాటికీ కాస్త పెంపుగా బిఆర్ఎస్ ప్రకటించింది తప్ప..కొత్తగా అలోచించి మేనిఫెస్టో ను రూపొందించలేదని అంటున్నారు.
కేసీఆర్ తమ మేనిఫెస్టో ను ప్రకటించగానే..వెంటనే రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ మేనిఫెస్టో ఫై స్పందించారు. తమ మేనిఫెస్టో ఎంత బలమైనదో చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయలేరని.. కర్ణాటకలో చేతులెత్తేశారని బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ వస్తోంది. ఇప్పుడు కేసీఆర్ అంతకు మించిన హామీలను ప్రకటించడంతో… అదంతా అబద్దమని చెప్పినట్లయిందని రేవంత్ చెప్పుకొచ్చారు. తాము ప్రకటించిన హామీలు ఏ మాత్రం భారం కాదని కేసీఆర్ సర్టిఫికెట్ ఇచ్చారని… అందుకే అంతకు మించినవి అమలు చేస్తామని చెబుతున్నారని కౌంటర్ ఇచ్చారు. ఓవరాల్ గా మాత్రం బిఆర్ఎస్ మేనిఫెస్టో ను అంత కాంగ్రెస్ మేనిఫెస్టో అనే మాట్లాడుకుంటున్నారు. మరి పోలింగ్ బూత్ లో ఏ మేనిఫెస్టో కు ఓటు వేస్తారో చూడాలి.
Read Also : Hyderabad: హైదరాబాద్‌లో ఓటర్ల జాబితా నుంచి 46,000 మంది పేర్లు తొలగింపు