Site icon HashtagU Telugu

Lok Polls : యధావిథిగా కేసీఆర్ బస్సు యాత్ర..

Kcr Road Show

Kcr Road Show

లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha) భాగంగా కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 17 రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టాలని పక్క ప్లాన్ తో కేసీఆర్ యాత్ర స్టార్ట్ చేసారు. కేసీఆర్ యాత్ర కు ప్రజలు సైతం బ్రహ్మ రథంపట్టారు. అడుగడుగునా రైతులు తమ సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు. ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి కేసీఆర్ సైతం లోక్ సభ ఎన్నికల్లో గెలుపు ధీమా ఫై మరింత నమ్మకం పెరిగింది. ఇదే క్రమంలో అధికార పార్టీ కాంగ్రెస్ ఫై కీలక వ్యాఖ్యలు చేస్తూ యాత్ర కొనసాగిస్తూ వచ్చారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వ్యాఖ్యలపై ఈసీ కి పిర్యాదు చేయడంతో..ఈసీ కేసీఆర్ కు షాక్ ఇచ్చింది. 48 గంటలపాటు ఎలాంటి ప్రచారం చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, రోడ్ షోలు, మీడియాలో బహిరంగంగా మాట్లాడొద్దని సూచించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఈ నిషేధం వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు, ప్రింట్ మీడియాల ద్వారా ఎక్కడా ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు కేసీఆర్ ప్రచారం చేయలేదు.

We’re now on WhatsApp. Click to Join.

ఈసీ ఆదేశించిన 48 గంటలు ఈరోజు సాయంత్రంతో పూర్తి కావడం తో..ఈరోజు 08 గంటల నుండి కేసీఆర్ తన యాత్రను పున:ప్రారభించబోతున్నారు. అయితే ముందుగా చేసుకున్న షెడ్యూల్ ప్రకారమే యాత్ర కొనసాగనుందని బిఆర్ఎస్ వర్గీయులు తెలిపారు. ఈ మేరకు యాత్ర షెడ్యూల్ ను రిలీజ్ చేసారు.

Read Also : Nara Lokesh: నేడు నంద్యాలలో లోకేష్ పర్యటన