Site icon HashtagU Telugu

KCR : కేసీఆర్ వెనుకుండి నడిపిస్తున్నారా..?

Kcr Twist

Kcr Twist

తెలంగాణ (Telangana) లో మరో 40 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు (2023 Assembly Elections) జరగబోతున్నాయి..ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అధికార పార్టీ (BRS) తో పాటు ప్రతిపక్ష పార్టీలు (BJP, Congress) పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే తమ మేనిఫెస్టో లను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లారు. ఎవరికీ వారు గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తూ ప్రత్యర్థి పార్టీల ఫై విమర్శలు , కౌంటర్లు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

ఇక అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) విషయానికి వస్తే..అందరి కంటే ముందే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. ఆ తరువాత ఆచితూచి అడుగులేస్తూ ముందుకు వెళ్తుంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత బిఆర్ఎస్ కు వరుస షాకులు ఎదురవుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కాంగ్రెస్ లో చేరడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఉన్న నేతలను కాపాడుకుంటూ..ఇతర పార్టీ లనుండి నేతలను ఆహ్వానిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే పార్టీ ప్రచారం..ఇతర నేతలను ఆహ్వానించడం..సొంత పార్టీ లో అలకపాన్పు ఎక్కినా నేతలను బుజ్జగించడం , ఇతర పార్టీల నేతలకు కౌంటర్లు ఇవ్వడం వంటివి కేటీఆర్ (KTR) , కవిత (Kavitha)లు చేసుకుంటుండగా..కేసీఆర్ (KCR) మాత్రం ఇవన్నీ వెనుకుండి నడిపిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గత వారం రోజులుగా కేసీఆర్ వరుసగా పలు జిల్లాల్లో పర్యటిస్తూ..భారీ సభలు నిర్వహించారు. దసరా సందర్బంగా బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ వరుస సభాలతో బిజీ కానున్నారు. అయితే కేసీఆర్ ప్రచారం కన్నా ఎక్కువగా తెర వెనుక పనులు చక్కబెట్టాడనికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో మాట్లాడుతూ..వారిని మరింత స్పీడ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో అవతల పార్టీల నేతల మూమెంట్ ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దానికి తగ్గ ప్రణాళికలు వేస్తున్నారు.

ఇక కేటీఆర్,కవితలు సైతం క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తల్ని యాక్టివ్ చేసి.. గ్రామ స్థాయికి ప్రచారం వెళ్లేలా చేసే బాధ్యతను చూసుకుంటున్నారు. ప్రత్యేకంగా వారికి కొన్ని ప్రాంతాలను కూడా కేటాయించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. షెడ్యూల్ రాక ముందు నుంచే కేటీఆర్, కవిత తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రచార కార్యక్రమాలు, చేరికలను సమన్వయపరుస్తున్నారు. మొత్తం మీద ఈసారి ఎన్నికల ప్రచారం లో కేసీఆర్ కంటే కేటీఆర్ , కవితలే ముందుంటున్నారు.

Read Also : National Police Memorial Day 2023 : మీ త్యాగం మరువం