KCR Operation Munugode: `ముందస్తు`గా కేసీఆర్ `ఆపరేషన్ మునుగోడు`

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆపరేషన్ విజయవంతం అయింది. వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ద్వారా బీజేపీ ని కేసీఆర్ కార్నర్ చేశారు.

  • Written By:
  • Updated On - October 29, 2022 / 04:44 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆపరేషన్ విజయవంతం అయింది. వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ద్వారా బీజేపీ ని కేసీఆర్ కార్నర్ చేశారు. నోటుకు ఎమ్యెల్యే కేసును రక్తి కట్టించారు. ఇక ఢిల్లీ వెళ్లి లొల్లి చేయాల్సిన అవసరం లేదని ఆయన నిర్దారించుకున్నారు. అంతే కాదు శనివారం కూడా మరిన్ని ఆడియోలను విడుదల చేసి ఈ నెల ౩౦ వ తేదీన మునుగోడులో బహిరంగ సభ పెట్టనున్నారు.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వరుసగా రెండో రోజు శుక్రవారం ప్రగతి భవన్‌లో మంత్రులు కె.టి. రామారావు, టి.హరీష్‌రావు, సీనియర్‌ నేతలతో భేటీ అయ్యారు. నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’పై పార్టీ స్పందన బాగుందని గులాబీ బాస్ కితాబు ఇచ్చారట. ఈ సమావేశంలో దీపావళికి ముందు, తర్వాత టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పి. రోహిత్ రెడ్డి, రామచంద్రభారతి, నంద కుమార్‌ల మధ్య జరిగిన సంభాషణల ఆడియో క్లిప్‌లను విన్నారని చెబుతున్నారు. ఈ క్లిప్‌లు శుక్రవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారాయి.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ‘బహిర్గతం’ చేసేందుకు కొన్ని అదనపు ఆడియో, వీడియో క్లిప్‌లను శనివారం విడుదల చేయనున్నట్లు పార్టీ అంతర్గత సమాచారం. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని చండూర్‌లో అక్టోబర్ 30న సిఎం బహిరంగ సభలో ప్రసంగిస్తారని, తన ప్రసంగంలో ఎమ్మెల్యేల అక్రమాస్తుల అంశంపై ఆయన మౌనం వీడాలని భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.

Also Read:   Munugode: మునుగోడుపై బీజేపీ హైరానా

బుధవారం మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు హాజరైన నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలో ఒకరైన రేగా కాంతారావు శుక్రవారం తెల్లవారుజామున తన ఫేస్‌బుక్ పేజీలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గురించి స్పందించారు.

శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పూర్తి సమాచారాన్ని చెబుతారని అన్నారు. కానీ , సీఎం ఎలాంటి మీడియా సమావేశం నిర్వహించలేదు. సీఎం శుక్రవారం న్యూఢిల్లీకి వెళ్లి అక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఎమ్మెల్యేలను ట్రాప్ ద్వారా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాను వెల్లడిస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ, పార్టీ అంతర్గత సమాచారం ప్రకారం, సీఎం దేశ రాజధానిని సందర్శించే ప్రణాళికలు లేవు.బీజేపీ పార్టీ కి రాజకీయంగా జరగాల్సిన నష్టం జరిగిందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఇక ఢిల్లీ టూర్ మానుకొని ముందస్తు దిశగా అడుగులు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస గెలిచినా తరువాత ముందస్తుకు కేసీఆర్ ప్లాన్ చేస్తారని తెలుస్తుంది.

Also Read:   Wine Shops Closed: మందు బాబులకు బ్యాడ్ న్యూస్… మూడు రోజుల పాటు వైన్ షాపులు బంద్..!