Site icon HashtagU Telugu

Telangana PRC : తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ తీపి కబురు

Cm Kcr

Cm Kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వ ఉద్యోగులకు (Government Employees) తీపి కబురు తెలిపారు. ఉద్యోగులకు పే స్కేల్‌ చెల్లింపు కోసం పే రివిజన్‌ కమిటీని (PRC) నియమించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్‌గా ఎన్‌ శివశంకర్‌ (రిటైర్డ్ ఐఎఎస్), సభ్యుడిగా బీ రామయ్య (రిటైర్డ్ ఐఏఎస్) సీఎం కేసీఆర్‌ నియమించారు. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఆరు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి వరకూ ఉద్యోగులకు 5 శాతం మధ్యంతర భృతి(IR) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పీఆర్సీ కమిటీ వేయడం పట్ల రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఐఆర్ 5 శాతం కాకుండా 18 శాతం ఇవ్వాలని కోరుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కేంద్ర ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యోగులే ఎక్కువగా సంపాదించుకుంటారని గతంలో కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు అందేలా ప్రొఫెషనల్ రెగ్యులేషన్ కమిషన్ (PRC)ని త్వరలోనే ప్రకటిస్తామని గతంలో కేసీఆర్ తెలిపారు. సంపద సృష్టిలో తెలంగాణ విజయం సాధించిందని, ప్రయోజనాలను అన్ని వర్గాలతో పంచుకునేందుకు కట్టుబడి ఉందన్నారు. త్వరలో ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాల పరిధిని విస్తరించడంతో పాటు మరెన్నో కార్యక్రమాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి (BRS) అధికారంలో కొనసాగుతుందని, మరింత పెద్ద మెజారిటీ సాధిస్తుందని కెసిఆర్ అన్నారు.

Read Also : Hit By Teacher : హోమ్ వర్క్ చేయలేదని యూకేజీ బాలుడిపై టీచర్ దాడి..బాలుడు మృతి