Site icon HashtagU Telugu

KCR @ Maharashtra: మహారాష్ట్ర లో కేసీఆర్ మరో సభ, 26న లక్ష మందితో..

Kcr Another House In Maharashtra, With Lakhs Of People On The 26th ..

Kcr Another House In Maharashtra, With Lakhs Of People On The 26th ..

ఢిల్లీ లిక్కర్ హడావిడి తగ్గడంతో జాతీయ రాజకీయాల వైపు మళ్లీ KCR దూకుడు పెంచారు. మహారాష్ట్ర లోని లోహ ప్రాంతంలో ఈ నెల 26 న బీ ఆర్ ఎస్ సభ పెట్టె ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఇద్దరూ వారం రోజులుగా నాందేడ్లోనే ఉంటూ సభ ఏర్పాట్లు చూస్తున్నారు. నిజామబాద్ జిల్లా నుంచి ప్రజలను తరలించడంతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నుంచి జనసమీకరణ చేస్తున్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచారం ప్రారంభించారు. వాహనాలకు రెండు వైపులా టీవీ స్క్రీన్లు అమర్చి గ్రామాల్లోతిప్పుతూ KCR పథకాలను ప్రచారం చేస్తున్నారు. లోహ అసెంబ్లీ నియోజకవర్గంలోని 16 మండలాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.బీఆర్ఎస్ ప్రచారం ఉద్ధృతి కారణంగా అక్కడ ఎటు చూసినా గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. అప్పుడే ఎన్నికలు వచ్చాయా అన్నట్లుగా హడావుడి కనిపిస్తోంది. స్థానిక నాయకులూ కొందరు బీఆర్ఎస్లో ఇప్పటికే చేరడంతో గులాబీ పార్టీని అక్కడ జనం గుర్తించగలుగుతున్నారు.

నాందేడ్ సభ ఇప్పటికే అనుకున్నట్లుగా నిర్వహించగలగడంతో ఇప్పుడు లోహ సభ సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. లక్ష మందితో సభ నిర్వహించాలన్న లక్ష్యంతో నిజామబాద్ జిల్లా బిచ్కుంద బాన్సువాడ బోధన్ ఆర్మూర్ తదితర ప్రాంతాల నుంచి జనసమీకరణకు ఏర్పాట్లు చేసుకున్నారు.

ఈ నెల 26న మహారాష్ట్రలోని ‘లోహ’లో బీఆర్ఎస్ సభ నిర్వహించనుంది. గత నెలలో సభ నిర్వహించిన నాందేడ్కు ఈసారి లోహ కూడా సమీపంలోనే ఉంది. నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు మార్గంలో 70 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ప్రాంతం. నిజామాబాద్ నుంచి వెళ్లి స్థిరపడినవారు లోహ కాంధార్ ముద్కేడ్ తదితర ప్రాంతాలతో పెద్దసంఖ్యలో ఉండడంతో సభ సక్సెస్ చేయడానికి నాయకులు అక్కడే ఉంటూ మొబిలైజ్ చేస్తున్నారు.

మహారాష్ట్రలో మరో సభ నిర్వహించడానికి బీఆర్ఎస్ చేస్తున్న ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా పొరుగునే ఉన్న నిజామాబాద్ జిల్లా నుంచి నాయకులు ఇప్పటికే సభ ఏర్పాట్లు జనసమీకరణలో నిమగ్నమైపోయారు. అంటే లిక్కర్ కేసు నుంచి ఇక కవిత బయట పడినట్టే కనిపిస్తుంది.

Also Read:  Chandra Babu to Assembly: అనురాధ కోసం అసెంబ్లీకి చంద్రబాబు, వైసీపీకి టెన్షన్