అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఘోర ఓటమి చవిచూసిన కేసీఆర్ (KCR)..లోక్ సభ (Lok Sabha Elections) ఎన్నికలతో సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ తరుణంలో గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా తొలి జాబితాలో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్..ఈరోజు బుధువారం మరో ఇద్దర్ని ప్రకటించారు.
ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ, బీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్ (ఎస్టీ రిజర్వ్) స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ప్రకటించగా..ఈరోజు మరో ఇద్దరు బీఆర్‌ఎస్ అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య పేరును ప్రకటించారు. నేటి వరంగల్ ముఖ్యనేతలతో జరిపిన చర్చల అనంతరం సమష్టి నిర్ణయాన్ని అనుసరించి వరంగల్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను కేసీఆర్ ప్రకటించడం జరిగింది. కావ్య వచ్చేసి స్టేషన్ ఘన్ పూర్ ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె.
Read Also : Telugu States : తెలుగు రాష్ట్రాల్లో అంబుడ్స్‌మన్ లేని వర్సిటీలు ఇవే!