Warangal BRS Candidate: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మారెపల్లి సుధీర్ కుమార్

వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేశారు పార్టీ అధినేత కేసీఆర్. గత వారం రోజులుగా ఈ స్థానం నుంచి రాజయ్య పేరు ప్రధానంగా వినిపించింది.

Warangal BRS Candidate: వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేశారు పార్టీ అధినేత కేసీఆర్. గత వారం రోజులుగా ఈ స్థానం నుంచి రాజయ్య పేరు ప్రధానంగా వినిపించింది. అక్కడ కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నిలబెట్టిన అభ్యర్థి, పైగా కడియం శ్రీహరికి స్థానికంగా బలమైన కేడర్ ని దాటి తమ అభ్యర్థిని గెలిపించుకోవాలి అంటే అంతే బలమైన నేతను బరిలోకి దింపుతారని అనుకున్నారందరు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును కేసీఆర్ ప్రతిపాదించారు.

డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా వాసి. మాదిగ సామాజికవర్గానికి చెందిన అతను ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 2001 నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడారు. ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడుగా, కేసీఆర్ తో కలిసి పనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. హైదరాబాద్‌లోని పార్టీ సీనియర్లతో పాటు వరంగల్‌కు చెందిన నాయకులతో చర్చించిన తర్వాత కేసీఆర్ తన అభ్యర్థిత్వాన్ని నిర్ణయించారు.

We’re now on WhatsAppClick to Join

అంతకుముందు మాజీ మంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్‌ కడియం కావ్యను బీఆర్‌ఎస్‌ నామినేట్‌ చేసింది. అయితే తండ్రీకూతుళ్లు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠకు తెరతీసింది.

Also Read: Varalaxmi Sarathkumar: ‘హనుమాన్’ తరహాలో ‘శబరి’ని ప్రేక్షకులు ప్రమోట్ చేస్తారని నమ్ముతున్నా