KCR and Modi relation : విప‌క్షాల మీటింగ్ కు `నో ఇన్విటేష‌న్‌`, BJP బీ టీమ్ గా BRS కు ముద్ర‌!

KCR and Modi relation:మ‌హారాష్ట్ర‌లో ఒంట‌రి పోరుకు సిద్ధ‌మై కేసీఆర్ కామెంట్లు చేయ‌డాన్ని శ‌ర‌ద్ ప‌వార్ సీరియ‌స్ గా తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - June 21, 2023 / 05:28 PM IST

KCR and Modi relation: మ‌హారాష్ట్ర‌లో ఒంట‌రి పోరుకు సిద్ధ‌మైన కేసీఆర్ కీల‌క కామెంట్లు చేయ‌డాన్ని సీనియ‌ర్ నేత శ‌ర‌ద్ ప‌వార్ సీరియ‌స్ గా తీసుకున్నారు. నాగ్ పూర్ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభించిన తరువాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆ సంద‌ర్భంగా `పీఎం మోడీ బెస్ట్ ఫ్రెండ్,  హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు మోడీకి స్వాగ‌తం ప‌ల‌క‌న‌ప్ప‌టికీ ప్ర‌ధానితో ట‌చ్ లో త‌ర‌చూ ఉంటాను. రాజ‌కీయ విష‌యాల‌ను మామూలుగా చ‌ర్చిస్తాను.` అంటూ చెప్ప‌డాన్ని ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ సీరియ‌స్ గా తీసుకున్నారు.

బీ టీమ్ ఆఫ్ మోడీ` అంటూ బీఆర్ఎస్ పార్టీని ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ (KCR and Modi relation) 

`బీ టీమ్ ఆఫ్ మోడీ` అంటూ బీఆర్ఎస్ పార్టీని ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ వ్యాఖ్యానించ‌డం కేసీఆర్ ప‌రువును గంగ‌లో క‌లిపింది. ఆయ‌న విశ్వ‌స‌నీయ‌త‌, నిజాయితీ మీద అనుమానం ఉంద‌ని వెల్ల‌డించారు. కాంగ్రెస్ పార్టీని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి కేసీఆర్ ఎత్తుగ‌డ వేస్తున్నార‌ని అనుమానించారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు జాతీయ స్థాయిలో కేసీఆర్ నాయ‌క‌త్వం మీద అనుమానాలు రేకెత్తించింది. మ‌హారాష్ట్రలో ఒంటరిగా బీఆర్ఎస్ పోటీ చేస్తుంద‌ని ఆయ‌న చెప్ప‌డాన్ని హాస్యాస్ప‌దంగా ప‌వార్ తీసుకున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన మార్కెట్ క‌మిటీ ఎన్నిక‌ల్లోనూ డిపాజిట్లు రాలేదు. నాగ్ పూర్ లో పార్టీ ఆఫీస్ ప్రారంభించ‌నంత మాత్రాన బీఆర్ఎస్ కు మ‌హారాష్ట్ర‌లో స్థానం ఉండ‌ద‌ని చుర‌క‌లు వేయ‌డం గ‌మ‌నార్హం.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు ఉంటుంద‌ని కూడా టాక్ బ‌లంగా

తొలి నుంచి బీజేపీకి బీ టీమ్ గా. బీఆర్ఎస్ పార్టీ ఉంద‌ని కాంగ్రెస్  (KCR and Modi relation) చెబుతోంది. కానీ, ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌నల నేప‌థ్యంలో కాంగ్రెస్ శిబిరంలో బీఆర్ఎస్ క‌నిపించింది. దీంతో బీజేపీకి దూరం జ‌రుగుతున్నార‌ని టాక్ న‌డిచింది. రాబోవు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు ఉంటుంద‌ని కూడా టాక్ బ‌లంగా ఉండేది. కానీ, నాగ్ పూర్ పార్టీ ఆఫీస్ ప్రారంభం త‌రువాత మీడియాలో చేసిన కామెంట్లు బీజేపీకి బీ టీమ్ గా కేసీఆర్ ప‌నిచేస్తున్నార‌న్న అనుమానం బ‌ల‌ప‌డింది.

Also Read: BRS MLAs: ఎమ్మెల్యేల డర్టీ పిక్చర్.. బీఆర్ఎస్ బేజార్!

మాయ‌జాలంతో కూడిన రాజ‌కీయాలు చేయ‌డంలో కేసీఆర్ దిట్ట‌. మాట‌కారిత‌నం రెండు సార్లు ఆయ‌న్ను సీఎం చేసింది సమకాలీన రాజకీయాల్లో ఓట‌ర్లు మిస్మ‌రైజ్ చేసే. లీడ‌ర్ల‌లో కేసీఆర్ మొద‌టి వ‌రుస‌లో ఉంటారు. అదే మాట‌కారిత‌నంతో మూడోసారి సీఎం కావాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఆ దిశ‌గా అడుగులు వేస్తోన్న ఆయ‌న లోక్ స‌భ ఎన్నిక‌ల నాటికి వ్యూహాల‌ను మార్చుతార‌ని టాక్ ఉంది.

రాజ‌కీయాలు చేయ‌డంలో కేసీఆర్ దిట్ట‌

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించాలని ఇటీవల ప్ర‌య‌త్నించారు. 2004, 2009లో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ఆయన ఎన్డీయేలోకి మారేందుకు ప్రయత్నించారు. 2014లో సమాన దూరాన్ని కొనసాగించారు. కానీ 2019లో మోడీ వ్యతిరేక ఫ్రంట్‌ని నిర్మించడానికి ప్రయత్నించారు. జాతీయ స్థాయి లీడ‌రుగా ఎద‌గ‌డానికి ప్ర‌య‌త్నించిన ఆయ‌న ఆశించిన ఫ‌లితాల‌ను సాధించ‌లేక‌పోయారు. వాస్తవానికి, తెలంగాణాలో కాంగ్రెస్ , బిజెపి కేసీఆర్ ప్రత్యర్థులుగా ఉండటంతో ఎటూ  (KCR and Modi relation)  తేల్చుకోలేని ప‌రిస్థితిలో ఉన్నారు.

Also Read : KCR cap getup : కేసీఆర్ టోపీ మ‌ర్మం! బ‌హిరంగ స‌భ‌ల్లో న్యూ గెట‌ప్!!

తొమ్మిదేళ్లుగా ఎన్డీయేకు మ‌ద్ధ‌తు ప‌లికిన ఆయ‌న ఇటీవ‌ల మోడీ వ్యతిరేక వైఖరిని అనుసరించారు. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, హేమంత్ సోరెన్ మరియు ఎం.కె.లతో సహా నాయకులను కలిశారు. స్టాలిన్, మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే మరియు హెచ్.డి దేవ‌గౌడ లో ముఖాముఖి నిర్వ‌హించారు. 2024 ఎన్నికలలో ప్ర‌ధాని మోడీని దింప‌డానికి వివిధ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించారు. హ‌ఠాత్తుగా ఆయ‌న బీజేపీకి వ్య‌తిరేక గొంతును స‌వ‌రించుకున్నారు.

బ‌హిరంగ స‌భ‌ల్లోనూ బీజేపీ జోలికి వెళ్ల‌డానికి కేసీఆర్ ధైర్యం చేయ‌డంలేదు (KCR and Modi relation)

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో శ‌ర‌శ్చంద్రారెడ్డి అప్రూవ‌ర్ గా మారిన త‌రువాత నుంచి సీఎం కేసీఆర్ వాయిస్ మారింది. అప్ప‌టి వ‌ర‌కు బీజేపీ మీద ఎగ‌సిప‌డిన ఆయ‌న క్ర‌మంగా వాయిస్ ను త‌గ్గించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మీద ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేయ‌డానికి సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు. బీజేపీతో కుమ్మ‌కైన‌ట్టు (KCR and Modi relation) క‌నిపిస్తున్నార‌ని కాంగ్రెస్, ఎన్సీపీ అనుమానిస్తోంది. న‌మ్మ‌క‌మైన లీడ‌ర్ కాద‌నే భావ‌న జాతీయ స్థాయిలో ఏర్ప‌డింది. ఇటీవ‌ల నిర్వ‌హిస్తోన్న బ‌హిరంగ స‌భ‌ల్లోనూ బీజేపీ జోలికి వెళ్ల‌డానికి కేసీఆర్ ధైర్యం చేయ‌డంలేదు. ఇవ‌న్నీ చూసిన త‌రువాత బీజేపీకి బీ టీమ్ గా బీఆర్ఎస్ పార్టీని భావిస్తూ జాతీయ స్థాయిలోని విప‌క్ష లీడ‌ర్లు కేసీఆర్ ను దూరంగా పెడుతున్నారు. ఈనెల 23న జ‌రిగే విప‌క్షాల మీటింగ్ కు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం అంద‌లేద‌ని తెలుస్తోంది.