Site icon HashtagU Telugu

KCR’s national ambition: కేసీఆర్, కుమారస్వామి భేటీ- Z+భద్రతపై హాట్ న్యూస్

Kcr Kumraswamy

Kcr Kumraswamy

ఎవర్ని ఎక్కడ పెట్టాలి?ఎక్కడ పైకిలేపాలి?ఎక్కడ తొక్కాలో బాగా తెలిసిన రాజకీయనాయకుడు కేసీఆర్. సాదాసీదాగా తిరిగే కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి తెలంగాణలో Z+భద్రతను కేసీఆర్ సర్కార్ కల్పించింది. ఇందులో కేసీఆర్ లాజిక్ ఏమిటో ప్రత్యర్థులకు అర్థం కావటంలేదు. అంతేకాదు కర్ణాటకలో ఇదో పెద్ద న్యూస్ గా మారింది.
కర్ణాటక మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి శనివారం రాత్రి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ రాత్రి 10.55 గంటలకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రం చేరుకున్నారు.శనివారం అర్దరాత్రి 12.15 గంటల సమయంలో హైదరాబాద్ కు చేరుకున్న కుమారస్వామికి తెలంగాణ ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరి కేటాయించారు. విమానాశ్రయం నుంచి ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్ చేరుకున్న కుమారస్వామి అక్కడే బసచేశారు. ఆదివారం మద్యాహ్నం 12.30 గంటలకు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో భేటీ జరుగుతుంది. ఇద్దరు వివిధ అంశాలపై చర్చిస్తారు.. సాయంత్రం 4 గంటల వరకు కేసీఆర్, కుమారస్వామి చర్చలు ఉంటాయి.
ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నుంచి కుమారస్వామి బెంగళూరు చేరుకుంటారు.
బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చెయ్యడానికి ప్రాంతీయ పార్టీల నాయకులు అందరిని ఏకం చెయ్యడానికి కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్ తో పాటు వివిద రాష్ట్రాలకు చెందిన నాయకులతో కేసీఆర్ భేటీ అయిన విషయం విదితమే.
భారత మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బెంగళూరుతో సహ ఎక్కడ తిరిగినా సాదాసీదాగా తిరుగుతుంటారు.హైదరాబాద్ కు వచ్చిన కుమారస్వామికి తెలంగాణ ప్రభుత్వం Z+ కేటగిరి భద్రత ఏర్పాటు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో కేసీఆర్ వ్యూహాన్ని ప్రత్యర్థులు వెదుకుతున్నారు.

Cover Pic- File Phone

Exit mobile version