Telangana Politics: ముఖ్యమంత్రి కెసిఆర్ పై వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పచ్చి అబద్ధాలకోరు అంటూ విమర్శలు గుప్పించారు. ఈ రోజు శనివారం మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల సీఎం కెసిఆర్ ని టార్గెట్ చేశారు.
వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఈ రోజు వరకు కెసిఆర్ సాధించింది అప్పులు, ఆత్మహత్యలు, అబద్దాలేనని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ప్రసంగం గమనిస్తే ఆయన ప్రసంగం అంతా అబద్దాలమయమేనని అన్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి కెసిఆర్ చెప్పే మాటలన్నీ అబద్దాలేనని, రాష్ట్రాన్ని చూసి దేశం నివ్వెరపోవడం కాదు..కెసిఆర్ కమీషన్లు, కబ్జాలు, దందాలు చూసి దేశం నవ్వుకుంటుందని సంచలన కామెంట్స్ చేశారామె. అబద్దాలు చెప్పి రెండు సార్లు అధికారం చేపట్టిన ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను రెండు సార్లు మరిచారని, తెలంగాణ ప్రజలను మాయమాటలతో మోసం చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు షర్మిల.
తెలంగాణ ప్రజల ఒక్కొక్కరిమీద లక్షకు పైగానే అప్పు ఉందని ఆమె అన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.17 లక్షలకు పెరిగితే .. ఒక్కొక్కరి మీద రూ.1.50లక్షల అప్పు ఎందుకు ఉందని ఆమె ప్రశ్నించారు. 2014లో రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రం.. 2023 నాటికి 5 లక్షల కోట్ల అప్పులకు చేరుకుందని షర్మిల గుర్తు చేశారు. జలయజ్ఞం ప్రాజెక్టులను తమ సొంత ప్రాజెక్టులుగా వక్రీకరిస్తున్నట్టు ఆమె ఫైర్ అయ్యారు. కాళేశ్వరం డిజైన్ పేరుతో లక్ష కోట్లు పెంచి తీరా లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వకుండా మోసం చేసిన ఘనత కెసిఆర్ కి దక్కుతుందని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు షర్మిల.
Read More: Chiranjeevi : నేను ఆ టెస్ట్ చేయించకపోతే క్యాన్సర్ వచ్చేదేమో.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..