KCR Absent : ఎట్ హోమ్ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన కేసీఆర్..!!

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్ర్య దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Cm Kcr Job Notification

Cm Kcr Job Notification

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్ర్య దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో భాగంగా సోమవారం భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రావాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఖరి సమయంలో మనసు మార్చుకున్నట్లు సమాచారం.

కేసీఆర్ ఎట్ హెమ్ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి వస్తున్నారని రాజ్ భవన్ వర్గాలకు cmo నుంచి సమాచారం అందింది. కానీ ఈ కేసీఆర్ దూరంగా ఉన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్, మరికొంతమంది ఉన్నతాధికారులు మాత్రమే ప్రభుత్వం తరపున ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు, ఇతర టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో అగుపించలేదు.

  Last Updated: 16 Aug 2022, 10:33 AM IST